1. ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా భారత్
అధిక ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న పెద్ద దేశాల్లో అగ్రగామిగా భారతదేశం కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఒడిశా సీఎంగా మోహన్‌చరణ మాఝి
గిరిజన నేత మోహన్‌చరణ మాఝి ఒడిశా ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ సభాపక్ష నేతల సమావేశం జరిగింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. నూతన సైన్యాధిపతిగా ఉపేంద్ర ద్వివేది
దేశ నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్మీ వైస్‌చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఆయన జూన్ 30న కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు ముగింపు!
ఇజ్రాయెల్, హమాస్ మధ్య 8 నెలలుగా జరుగుతున్న పోరుకు ముగింపు పలికే ఉద్దేశంతో తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికకు ఐరాస భద్రతా మండలి ఆమోదం తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు
ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని కన్వెన్షన్ కేంద్రంలో జరిగిన సమావేశంలో చంద్రబాబును ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు జనసేన అధినేత, శాసనసభాపక్ష నాయకుడు పవన్‌కల్యాణ్ ప్రకటించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.