• facebook
  • whatsapp
  • telegram

Latest News:21-03-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

01.  MBBS: వైద్య, ఆరోగ్యశాఖలో 5,348 పోస్టుల భర్తీ

రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖలో 5,348 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్య విద్య డైరెక్టరేట్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌, ఐఐపీఎం, ఆయుష్‌, ఔషధ నియంత్రణ మండలి, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రుల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.

 పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



02. Medical colleges: కొత్త వైద్య కళాశాలలకు చకచకా ఏర్పాట్లు

రాష్ట్రంలో రానున్న విద్యా సంవత్సరంలో ఎనిమిది కొత్త వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎనిమిది కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణను రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు.....

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



03. TSSP: టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్ల శిక్షణకు కసరత్తు

తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ) విభాగం కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. మార్చి లేదా  ఏప్రిల్‌ మొదటి వారంలో శిక్షణను ప్రారంభించనున్నారు. శిక్షణకు అనువైన మైదానాలతో పాటు శిక్షణార్థుల బసకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



 

04.  Group-I: గ్రూప్‌-1 మార్కుల వెల్లడికీ ఆంక్షలు

గ్రూప్‌-1 మార్కుల వెల్లడిలో ఏపీపీఎస్సీ ఇంకా గోప్యత పాటిస్తోంది. 2022 నోటిఫికేషన్‌లో పేర్కొన్నదాని కంటే ఏడు నెలల ఆలస్యంగా మార్కులు వెల్లడిస్తామని విమర్శల నేపథ్యంలో ప్రకటించినా, అవీ దరఖాస్తు చేసినవారికే తెలియజేస్తామని ఆంక్షలు విధించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



05. EAPCET: మే 16 నుంచి ఈఏపీసెట్‌ 

ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ను మే 16 నుంచి 22వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్‌ తెలిపారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 13నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా..

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



06. Policy CET: పాలిసెట్‌ యథావిధిగా కొనసాగుతుంది: కమిషనర్‌

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ ఏప్రిల్‌ 27న యథావిధిగా కొనసాగుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.