• facebook
  • whatsapp
  • telegram

MBBS: ఎంబీబీఎస్‌ సి-కేటగిరీ సీట్లను పాత పద్ధతిలోనే భర్తీ చేయాలి’

*  ఆన్‌లైన్‌లోనే యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియ 

ఈనాడు, అమరావతి: ఎంబీబీఎస్‌లో ‘సి’ కేటగిరీ సీట్ల భర్తీ బాధ్యతను జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ)కి అప్పగించొద్దని ప్రైవేట్‌ వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ‘సి’ (ఎన్నారై) కేటగిరిలోని 15% సీట్లను తామే భర్తీ చేస్తామని జాతీయ వైద్య కమిషన్‌ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసింది. దీనిపై సంఘం జూన్ 27న ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోనే చేపడుతున్నారని గుర్తుచేసింది. ఎన్‌ఎంసీ తాజా ప్రతిపాదనపై యాజమాన్యాలతో చర్చించాలని సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జి.కాశింబి కోరారు. 
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.