• facebook
  • whatsapp
  • telegram

ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?



పీజీ తర్వాత ఎంఫిల్‌ చేయొచ్చా? దీనికీ, పీహెచ్‌డీకీ తేడా ఏమిటి? - ఎం. ఆకాంక్ష

ఎంఫిల్‌ డిగ్రీతో లభించే ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదు. ఎవరైనా ఎంఫిల్‌ ప్రోగ్రాంలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ ఇస్తే.. అందులో చేరి మోసపోకండి! 


జాతీయ విద్యావిధానం -2020 ఆధారంగా 2022లో యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం- దేశంలో ఏ యూనివర్సిటీ కూడా ఎంఫిల్‌ డిగ్రీలో అడ్మిషన్లు చేపట్టకూడదు. కొన్ని యూనివర్సిటీలు ఎంఫిల్‌ ప్రోగ్రాం కోసం నోటిఫికేషన్లు ఇవ్వడాన్ని యూజీసీ తప్పుపడుతూ డిసెంబరు 2023లో ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఒక ప్రకటన కూడా జారీ చేసింది. గతంలో కూడా కొన్ని యూనివర్సిటీలు దూరవిద్య ద్వారా ఎంఫిల్‌ ప్రోగ్రాంను అందించాయి. దూరవిద్యా విధానంలో పొందిన ఎంఫిల్‌ డిగ్రీలు చెల్లుబాటు కావని యూజీసీ చాలా సందర్భాల్లో తెలియజేసింది.


ఎంఫిల్‌/ పీహెచ్‌డీ చేయాలంటే పీజీలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి. ఎంఫిల్, పీహెచ్‌డీ రెండూ రిసెర్చ్‌ డిగ్రీలే. కానీ, పీహెచ్‌డీ ప్రోగ్రాం కనీస వ్యవధి మూడు సంవత్సరాలు. ఎంఫిల్‌ వ్యవధి ఒక సంవత్సరమే! గతంలో పీజీ ప్రోగ్రాంలో ప్రాజెక్ట్‌ వర్క్‌ లేకపోవడం వల్ల పీహెచ్‌డీలో చేరాక పరిశోధనలో ఇబ్బందులు తలెత్తకుండా, పరిశోధన సన్నద్ధత కోసం ఎంఫిల్‌ డిగ్రీని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం పీజీలో, డిగ్రీలో కూడా ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉంటోంది. దీనివల్ల విద్యార్థులు డిగ్రీ/ పీజీలోనే పరిశోధన పద్ధతుల్లో శిక్షణ పొందుతున్నారు. నూతన విద్యావిధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీతో నేరుగా పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందే అవకాశాలుంటాయి. నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీతో నెట్‌ పరీక్షకు కూడా అర్హులయ్యే అవకాశం ఉంది. డిగ్రీ కాలేజీ/ యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి నెట్‌/ పీహెచ్‌డీ అర్హత సరిపోతుంది. పీహెచ్‌డీ ప్రవేశానికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష కానీ, నెట్‌లో ఉత్తీర్ణత కానీ అవసరం. అందువల్ల ఎంఫిల్‌ డిగ్రీతో లభించే ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదు. ఎవరైనా ఎంఫిల్‌ ప్రోగ్రాంలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ ఇస్తే.. అందులో చేరి మోసపోకండి!


- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

‣ ఏఐ నైపుణ్యం.. తక్షణ కర్తవ్యం!

‣ ఇష్టం పెంచుకుంటే.. కష్టం కాదు!

‣ వినూత్న ప్రణాళికతో మెరుగైన కెరియర్‌

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.