* జూన్ 14న ఫలితాలు
* అభ్యంతరాలకు గడువు మే 31
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (National Eligibility-cum-Entrance Test) యూజీ (NEET UG 2024) ఫలితాల వెల్లడికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సమాయత్తమవుతోంది. ఈ మేరకు ప్రిలిమినరీ కీ విడుదలైంది. మే 31వ తేదీ రాత్రి 11.50 గంటల్లోగా ఆన్లైన్లో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించి కీపై అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అనంతరం జూన్ 14న ఫలితాలతో పాటు తుది కీ విడుదలకానున్నాయి. పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మే 5న దేశవ్యాప్తంగా 571 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఎంబీబీఎస్(MBBS), బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
♦ నీట్ యూజీ 2024 ప్రిలిమినరీ కీ కోసం క్లిక్ చేయండి
♦ నీట్ యూజీ 2024 ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి
♦ NEET 2024 MOCK COUNSELLING(TS)
♦ NEET 2024 MOCK COUNSELLING (ANDHRA PRADESH)
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.