విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

NTA: ఆరేళ్లలో 16 పరీక్షలు వాయిదా వేసిన ఎన్టీఏ



దిల్లీ: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 16 పరీక్షలను వాయిదా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్‌, రవాణా, సాంకేతిక తదితర సమస్యలను కారణాలుగా పేర్కొంది. డీఎంకే ఎంపీ కనిమొళి అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్‌ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.


‘‘2018లో ఎన్‌టీఏ ఏర్పడినప్పటి నుంచి 240 పరీక్షలను నిర్వహించింది. 5.4కోట్ల మందికిపైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అయితే, కొవిడ్‌ 19 మహమ్మారి, లాజిస్టిక్‌, సాంకేతిక సమస్యలు, పాలనా వ్యవహారాలు, న్యాయస్థానాల ఆదేశాలు వంటి కారణాల వల్ల పలు పరీక్షలను ఎన్‌టీఏ వాయిదా వేసింది’’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2020లో జేఈఈ మెయిన్‌, నీట్‌ యూజీ, 2021లో జేఈఈ మెయిన్‌, నీట్‌ యూజీలు కొవిడ్‌ కారణంగా వాయిదా పడ్డాయని పేర్కొన్నారు. 
 

-------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రేరణ లోపిస్తోందా?

‣ పొరపాట్లు దిద్దుకుంటే.. పక్కా గెలుపు!

‣ జాబ్‌ మార్కెట్‌లో ఏఐ జోరు!

‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

Published at : 22-07-2024 18:54:24

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం