* మొత్తం 3,712 ఖాళీల భర్తీ
ఈనాడు ప్రతిభ డెస్క్: ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2024’ (సీహెచ్ఎస్ఎల్) అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీని ద్వారా 3,712 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జులై 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. టైర్-1, టైర్-2 పరీక్షలు, కంప్యూటర్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ప్రశ్నపత్రం: టైర్-1 పరీక్షకు 200 మార్కులు కేటాయించారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్(బేసిక్ అరిథ్మెటిక్ స్కిల్స్), జనరల్ అవేర్నెస్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. టైర్-2 పరీక్షకు 405 మార్కులు కేటాయించారు. ఇందులో మ్యాథమేటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యుల్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.
సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ 2024 అడ్మిట్ కార్డులు (సదరన్ రీజియన్)
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.