• facebook
  • whatsapp
  • telegram

SSC Exam Calender: జూన్‌ 24న సీజీఎల్‌, ఆగస్టు 27న కానిస్టేబుల్‌ నోటిఫికేషన్లు విడుదల

* ఎస్‌ఎస్‌సీ ఉద్యోగ నియామక పరీక్షల క్యాలెండర్‌ విడుదల


 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది. 2024-25లో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలతో ప్రత్యేక చార్ట్‌ను విడుదల చేసింది. దీంట్లో 2024 జూన్‌ నుంచి 2025 ఫిబ్రవరి వరకు నిర్వహించే జూనియర్‌ ఇంజినీర్‌, సెలక్షన్‌ పోస్టులు, దిల్లీ పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, సీజీఎల్‌, ఎంటీఎస్‌, హవల్దార్‌, గ్రేడ్‌ సి/డి స్టెనోగ్రాఫర్‌, కానిస్టేబుల్‌ (జీడీ), జూనియర్‌ హిందీ ట్రాన్స్‌టేటర్‌ ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను ప్రకటించింది. ఆయా పోస్టులకు నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించే తేదీలను క్యాలెండర్‌లో పొందుపరిచింది. అప్పటి పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండొచ్చు. జూన్‌ 24న సీజీఎల్‌, 27న ఎంటీఎస్‌, ఆగస్టు 27 కానిస్టేబుల్‌ (జీడీ) నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. సెప్టెంబర్‌/ అక్టోబర్‌లో సీజీఎల్‌ పరీక్షలు, అక్టోబర్‌/ నవంబర్‌లో ఎంటీఎస్‌ పరీక్షలు, వచ్చే ఏడాది జనవరి/ ఫిబ్రవరిలో కానిస్టేబుల్‌ (జీడీ) రాత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల క్యాలెండర్‌ను ఈ కింది డాక్యుమెంట్‌లో చూడొచ్చు.



  ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్ క్యాలెండర్‌ 2024-25 షెడ్యూల్‌  
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.