* రోల్ నంబర్, పరీక్ష కేంద్రం వివరాల వెల్లడి
* మొత్తం 4,187 ఖాళీల భర్తీ
![]() |
ఈనాడు ప్రతిభ డెస్క్: దిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్-ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష-2024 పేపర్-1 అభ్యర్థుల రోల్ నంబర్, పరీక్ష కేంద్రం వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో రోల్ నంబర్, పరీక్ష కేంద్రం, నిర్వహణ తేదీ తదితర వివరాలను తెలుసుకోవచ్చు. రెండు లేదా మూడు రోజుల్లో అడ్మిట్‌కార్డులు విడుదల కానున్నాయి. ఈ పరీక్ష ద్వారా దిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన (సీఏపీఎఫ్) బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీలో 4,187 సబ్-ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. సీబీటీ రాత పరీక్ష(పేపర్-1, 2), శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.