• facebook
  • whatsapp
  • telegram

TG DOST Results: దోస్త్‌ ఫేజ్‌-1 సీట్ల కేటాయింపు ఫలితాలు

* జూన్‌ 6 నుంచి 13 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు
 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌- తెలంగాణ(దోస్త్‌) మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. ప్రవేశాల ప్రక్రియ మూడు విడతలుగా జరగనుంది. జులై 8న తరగతులు మొదలవుతాయి. రాష్ట్రంలోని వెయ్యికి పైగా డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది దాదాపు నాలుగున్నర లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, మహిళా విశ్వవిద్యాలయంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. 


   దోస్త్‌ ఫేజ్‌-1 సీట్ల కేటాయింపు ఫలితాల కోసం క్లిక్‌ చేయండి    


 

  దోస్త్‌ కాలపట్టిక...  
 

మొదటి విడత
రిజిస్ట్రేషన్‌: మే 6 నుంచి జూన్‌ 1 వరకు(రూ.200 రుసుం)
వెబ్‌ ఆప్షన్లు: మే 20 నుంచి జూన్‌ 2 వరకు
వెబ్‌ ఆప్షన్లు: మే 20 నుంచి జూన్‌ 2 వరకు
సీట్ల కేటాయింపు: జూన్‌ 6న 
సీట్లు పొందినవారి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: జూన్‌ 7 నుంచి 12 వరకు.

 

 

 

 

రెండో విడత
రిజిస్ట్రేషన్‌: జూన్‌ 6 నుంచి 13 వరకు(రూ.400 రుసుం)
వెబ్‌ ఆప్షన్లు: జూన్‌ 6 నుంచి 14 వరకు
సీట్ల కేటాయింపు: జూన్‌ 18న
సీట్లు పొందినవారి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: జూన్‌ 19 నుంచి 24 వరకు


 

మూడో విడత
రిజిస్ట్రేషన్‌: జూన్‌ 19 నుంచి 25 వరకు(రూ.400 రుసుం)
వెబ్‌ ఆప్షన్లు: జూన్‌ 19 నుంచి 26 వరకు
సీట్ల కేటాయింపు: జూన్‌ 29న
సీట్లు పొందినవారి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: జూన్‌ 29 నుంచి జులై 3 వరకు 
కళాశాలల్లో స్వయంగా రిపోర్టింగ్‌(3 విడతల్లో సీట్లు పొంది ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసినవారికి): జూన్‌ 29 నుంచి జులై 5 వరకు.
ఓరియంటేషన్‌ కార్యక్రమం: జులై 1 నుంచి 6 వరకు.
తరగతుల ప్రారంభం: జులై 8న

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.