* జులై 3 నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) సహాయ ఇంజినీరు(ఏఈ) పోస్టుల భర్తీకి జులై 14న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ రిజ్వీ బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్లో తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి 2023 అక్టోబరు 4న ప్రకటన జారీ చేశారు. రాతపరీక్షను గత మార్చి 31న నిర్వహించాలని నిర్ణయించినా ఎన్నికల కోడ్ వల్ల జులై 14కు వాయిదా వేసినట్లు ఆయన వివరించారు. జులై 3 నుంచి హాల్‌టికెట్లను సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.