* రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2024 (TG ICET Result) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జూన్ 5, 6 తేదీల్లో జరిగిన పరీక్షలకు మొత్తం 77,942 మంది హాజరయ్యారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాల్ని ఎంటర్ చేసి ర్యాంక్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. టాప్-10 ర్యాంకుల్లో ఎస్.ఎం.హుస్సేని (హైదరాబాద్), జె.భరత్(మాడుగుల), కె.లాస్య(మల్కాజ్గిరి), పి.రిషికారెడ్డి(నిజామాబాద్), కె.శివకుమార్(విజయవాడ), బి.అక్షిత్(హైదరాబాద్), బి.రాణి(విజయనగరం), గంగా షిండే(హైదరాబాద్), ఎన్.అరుణ్‌సింగ్(శంకర్పల్లి), బి.రవళి (ఖమ్మం) వరుసగా నిలిచారు. ఫలితాలను https://results.eenadupratibha.net/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
టీజీ ఐసెట్ 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి
టీజీ ఐసెట్ 2024 ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.