• facebook
  • whatsapp
  • telegram

TG LAWCET Result: లాసెట్ ఫలితాల్లో 72.66 శాతం ఉత్తీర్ణత

* డైరెక్ట్‌ రిజల్ట్‌ లింక్‌ ఇదే..

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ లాసెట్/ పీజీఎల్‌సెట్‌-2024 లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు పరీక్ష ఫలితాలను సెట్‌ నిర్వహణాధికారులు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాల వివరాలను వెల్లడించారు. జూన్ 3న తెలంగాణ లాసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా న్యాయవిద్యలో ప్రవేశాలు ఉంటాయి. పరీక్షకు మొత్తం 50,684 మంది దరఖాస్తు చేసుకోగా.. 40268 మంది హాజరయ్యారు. 29258 (72.66 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. లాసెట్‌ ఎల్‌ఎల్‌బీ (మూడేళ్లు) పరీక్షలో పీజీఎం అంబేడ్కర్‌(హైదరాబాద్‌), ఎస్‌.ప్రత్యూష్‌(గచ్చిబౌలి), టి.నరేష్‌(ఖమ్మం) మొదటి మూడు ర్యాంకులు; లాసెట్‌ ఎల్‌ఎల్‌బీ (అయిదేళ్లు) పరీక్షలో బి.శ్రీరామ్‌(మియాపూర్‌), పి.దినేశ్‌(కామారెడ్డి), ఆర్‌పీ విజయనందిని (మల్కాజ్‌గిరి) మొదటి మూడు ర్యాంకులు; పీజీఎల్‌సెట్‌ ఎల్‌ఎల్‌ఎం పరీక్షలో పీబీ సాయి విష్ణువర్దన్‌(సికింద్రాబాద్‌), పి.అబినీత్‌ జాసన్‌(పెనమలూరు), ఎన్‌.సిన్హా(హైదరాబాద్‌) మొదటి మూడు ర్యాంకులు సాధించారు. ఫలితాలు https://results.eenadupratibha.net/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.



 టీజీ లాసెట్‌ ఎల్‌ఎల్‌బీ (మూడేళ్లు) టాప్‌-10 అభ్యర్థుల జాబితా 


టీజీ లాసెట్‌ ఎల్‌ఎల్‌బీ (అయిదేళ్లు) టాప్‌-10 అభ్యర్థుల జాబితా  


టీజీ పీజీఎల్‌సెట్‌ ఎల్‌ఎల్‌ఎం టాప్‌-10 అభ్యర్థుల జాబితా 


తెలంగాణ లాసెట్-2024 ఫలితాల కోసం క్లిక్‌ చేయండి  
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.