హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో వివిధ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా ఈ ప్రక్రియ పూర్తి కానుంది. అలాగే.. 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి సైతం నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.