* జులై 4న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి జులై 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. టీజీ ఈఏపీసెట్ వెబ్ బేస్డ్ కౌన్సెలింగ్ 2024 ఎంపీసీ స్ట్రీమ్‌కు సంబంధించిన తేదీలను (రివైజ్డ్) రాష్ట్ర ఉన్నత విద్య మండలి విడుదల చేసింది. మే 7 నుంచి 11వ తేదీ వరకు టీజీ ఈఏపీసెట్ జరగ్గా.. ఫలితాలను మే 18న విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 74.98%, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 89.66% ఉత్తీర్ణత నమోదైంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా బీఈ/ బీటెక్/ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులు ఈఏపీసెట్ 2024తో పాటు ఇంటర్ ఎంపీసీ గ్రూప్ సబ్జెక్టులు జనరల్ 45%, ఇతరులు 40% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. మొత్తం మూడు విడతల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. తొలిదశ జులై 4 నుంచి 23 వరకు, రెండోదశ జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు, తుదిదశ ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు కొనసాగనుంది.
కౌన్సెలింగ్‌కు కావాల్సిన ధ్రువపత్రాలు...
‣ పదో తరగతి మార్కల మెమో
‣ ఇంటర్మీడియట్ మార్కుల మెమో
‣ ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్(టీసీ)
‣ స్టడీ సర్టిఫికెట్
‣ తాజాగా జారీ అయిన ఆదాయ ధ్రువపత్రం
‣ తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందిన కుల ధ్రువీకరణపత్రం
‣ తెలంగాణ ఈఏపీసెట్ 2024 హాల్‌టికెట్
‣ తెలంగాణ ఈఏపీసెట్ 2024 ర్యాంక్ కార్డు
‣ విద్యార్థి ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు
తొలిదశ | |
‣ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ | 04-07-2024 నుంచి 12-07-2024 వరకు. |
‣ ధ్రువపత్రాల పరిశీలన | 06-07-2024 నుంచి 13-07-2024 వరకు. |
‣ ఆప్షన్ల ఎంపిక | 08-07-2024 నుంచి 15-07-2024 వరకు. |
‣ ఆప్షన్ల ఫ్రీజింగ్ | 15-07-2024 |
‣ సీట్ల కేటాయింపు | 19-07-2024 |
‣ సెల్ఫ్ రిపోర్టింగ్ | 19-07-2024 నుంచి 23-07-2024 వరకు. |
రెండోదశ | |
‣ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ | 26-07-2024. |
‣ ధ్రువపత్రాల పరిశీలన | 27-07-2024. |
‣ ఆప్షన్ల ఎంపిక | 27-07-2024 నుంచి 28-07-2024 వరకు. |
‣ ఆప్షన్ల ఫ్రీజింగ్ | 28-07-2024. |
‣ సీట్ల కేటాయింపు | 31-07-2024. |
‣ సెల్ఫ్ రిపోర్టింగ్ | 31-07-2024 నుంచి 02-08-2024 వరకు. |
తుదిదశ | |
‣ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ | 08-08-2024. |
‣ ధ్రువపత్రాల పరిశీలన | 09-08-2024. |
‣ ఆప్షన్ల ఎంపిక | 09-08-2024 నుంచి 10-08-2024 వరకు. |
‣ ఆప్షన్ల ఫ్రీజింగ్ | 10-08-2024 |
‣ సీట్ల కేటాయింపు | 13-08-2024 |
‣ సెల్ఫ్ రిపోర్టింగ్ | 13-08-2024 నుంచి 15-08-2024 వరకు. |
♦ తెలంగాణ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ తేదీలు
♦ తెలంగాణ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ వెబ్సైట్
♦ తెలంగాణ మాక్ కౌన్సెలింగ్స్ - 2024
‣ ఇంజినీరింగ్ | |
‣ అగ్రికల్చర్ & మెడికల్ |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.