* టీజీపీఎస్సీ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం గురుకుల విద్యా సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి పరీక్షల టీజీపీఎస్సీ షెడ్యూల్ను విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 అధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు 2022 డిసెంబర్లో ఉద్యోగ ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పరీక్షలను జూన్ 24 నుంచి 29 వరకు నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రతి రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు ప్రారంభం కావడానికి మూడు రోజుల ముందు నుంచి హాల్టికెట్లు అందుబాటులో రానున్నాయి.
టీజీపీఎస్సీ రాత పరీక్షల షెడ్యూల్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.