• facebook
  • whatsapp
  • telegram

UGC-NET Exam Date: జూన్‌ 18న యూజీసీ- నెట్‌   

* ఓఎమ్మార్‌ పద్ధతిలో పరీక్ష

* ఎన్‌టీఏ ప్రకటన విడుదల


 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్ష తేదీ ఖరారైంది. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఉపయోగపడే ఈ పరీక్షను జూన్‌ 18న నిర్వహించనున్నట్లు యూజీసీ వెల్లడించింది. పరీక్షకు 10 రోజుల ముందు పరీక్ష కేంద్రం వివరాలు వెల్లడికానున్నాయి. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే ఓఎమ్మార్‌ ఆధారిత పరీక్ష (పెన్‌/ పేపర్‌) నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి అప్పగించింది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.

పరీక్ష విధానం: ఓఎమ్మార్‌ ఆధారిత పరీక్ష విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు... 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు... 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.


 

  UGC- NET June 2024 Website  

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.