‣ చదువుకోవడం సులభం..
నేషనల్ డిజిటల్ లైబ్రరీ పేరుతో అంతర్జాలంలో అందుబాటులో ఉన్న వెబ్‌సైట్‌ను ఖరగ్‌పూర్ ఐఐటీ అభివృద్ధి చేసింది. ఇందులోని సమాచారం ఉచితంగా లభిస్తుంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థుల వరకు ఆన్లైన్ పుస్తకాలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎల్ని ప్రారంభించింది. అన్ని భారతీయ భాషల నుంచి ముఖ్యమైన పుస్తకాలను ఇందులో పొందుపర్చారు. ఐఐటీ, జేఈఈ, నీట్, జామ్, గేట్, యూజీసీ, నెట్ పరీక్షలకు కావాల్సిన మెటీరియల్, ఆడియో, వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో తొలుత https://ndl.iitkgp.ac.in.వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. పేరు, పుట్టిన తేదీ, పట్టణం/గ్రామం, మెయిల్ ఐడీ, పాస్వర్డ్, చదువుతున్న విద్యాసంస్థ పేరు నమోదు చేయాలి. చదువు పూర్తయిన వారు జిల్లా గ్రంథాలయం పేరు నమోదు చేస్తే సరిపోతుంది. మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయిన తర్వాత కావాల్సిన పుస్తకాలు చదువుకోవచ్చు.
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. లోక్‌సభ ఫలితాలు వెలువడ్డాక.. ఎన్నికల కోడ్ ముగియగానే పోటీ పరీక్షల కాలం మొదలు కానుంది. ఇప్పటికే నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. జిల్లాలోని కేంద్ర గ్రంథాలయాలకు తాకిడి పెరగడంతో స్థలం దొరకడం గగనంగా మారింది. ఆర్థిక స్థోమత లేకపోవడం, పుస్తకాలు అందుబాటులో లేనప్పటికీ.. లక్ష్యం సాధించాలనే తపన ఉన్నవారికి ప్రస్తుతం అంతర్జాలం చక్కటి వేదిక. ఆన్లైన్ పరీక్షల సమాచారంతో పాటు ఉపయుక్తమైన సమగ్ర సమాచారంతో కూడిన ‘నేషనల్ డిజిటల్ లైబ్రరీ(ఎన్డీఎల్)’ వెబ్సైట్ బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతోంది.
‣ పరీక్షల తేదీలు
పోస్టుల సంఖ్య
గ్రూపు-1 563 ప్రిలిమ్స్ జూన్ 09
మెయిన్స్ అక్టోబరు 21 నుంచి
గ్రూపు-2 783 ఆగస్టు 7, 8
గ్రూపు-3 1,388 నవంబరు 17, 18
68 లక్షల పుస్తకాలు..
వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే 68 లక్షల పుస్తకాలు ఈ ఎన్డీఎల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. పాత మాదిరి ప్రశ్నపత్రాలు, విజేతల అనుభవాలు పుస్తక రూపంలో ఉంటాయి. ఏ విభాగానికి సంబంధించిన పుస్తకం కావాలో దానిపై క్లిక్ చేస్తే ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన పేజీలు ప్రత్యక్షమవుతాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.