డిగ్రీలో ప్రవేశాలకు చాలా మంది దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. వారి సౌకర్యార్థం శాతవాహన విశ్వవిద్యాలయం పలు కళాశాలల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అధునాతన సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు వస్తున్నా సాధారణ డిగ్రీ కోర్సులకూ ప్రాధాన్యం తగ్గడంలేదు. ఏయేటికాయేడు విద్యార్థుల నుంచి ఆదరణ పెరుగుతోంది. తక్షణం ఉపాధి లభిస్తుందనే నమ్మకంతో బీకామ్, బీఎస్సీ తదితర కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో 16 ప్రభుత్వ, 86 ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో అన్ని గ్రూపుల్లో కలుపుకొని మొత్తం 25 వేల పైచిలుకు సీట్లు అందుబాటులో ఉన్నాయి.
సహాయ కేంద్రాలు...
శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో విద్యార్థుల సౌకర్యార్థం సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో నేరుగా కలిసిగానీ, ఫోన్ చేసిగానీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. విద్యార్థులకు అవసరమైన సమాచారం అందిస్తారు. శాతవాహన విశ్వవిద్యాలయం 90304 02257, ఎస్సారార్ కళాశాల 94906 83621 నంబర్లకు ఫోన్ చేయాలని దోస్త్ కోఆర్డినేటర్లు సూచిస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు.. మే, జూన్ | |||
విడత | దరఖాస్తుకు | వెబ్‌ఆప్షన్‌కు | సీట్ల కేటాయింపు |
మొదటి | 6 నుంచి 29 | 20-30 | 6 |
రెండో | 6-13 | 6-14 | 18 |
మూడో | 19-25 | 19-26 | 2 |
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.