• facebook
  • whatsapp
  • telegram

Education Act: విద్యాహక్కు చట్టం అమలుపై విచారణ వాయిదా 

* పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలని పిటిషన్
 


హైదరాబాద్‌: విద్యాహక్కు చట్టం అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. న్యాయవాది తాండవ యోగేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మరోసారి సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. మంగళవారం (జులై 9) విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కర్ణాటక తరహాలో ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్ల విధానాన్ని పరిశీలిస్తున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు. ఈ నేపథ్యంలో విచారణను జులై 16వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.