• facebook
  • whatsapp
  • telegram

 TSPSC: త్వరలో గ్రూప్‌-1 ప్రకటన

* గతంలో నిర్వహించిన పరీక్షల రద్దు

* వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తాం

* పక్షం రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రశ్నపత్రాలు లీకైనందున గతంలో నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షను రద్దుచేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 60 ఖాళీలు అదనంగా చేర్చి త్వరలో కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నియామక బోర్డుల ద్వారా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలకు ఎంపికైన 441 మందికి బుధవారం నెక్లెస్‌ రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాఫ్‌నర్సుల పోస్టులను భర్తీచేశామని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికే ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. మరో పక్షం రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

సింగరేణి ఖాళీల్లో 80 శాతం ఆ ప్రాంతం వారికే

సంస్థలో ఏర్పడే ఖాళీల్లో 80 శాతం సింగరేణి ప్రాంతం వారికే ఇవ్వాలని నిర్ణయించాం. ఖాళీల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకున్నాం. సంస్థ పరిధిలోని ఉద్యోగాల భర్తీలో వయో పరిమితిని సడలించాలని సింగరేణి సీఎండీకి సూచించాం. గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసి ఆ ప్రాంతంలో సమస్యలన్నీ పరిష్కరిస్తాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తాం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఖాళీలన్నీ భర్తీచేసి యువత ఆశలను, ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేరుస్తామన్నారు. గత ప్రభుత్వం సింగరేణిలో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ అవసరాలకు మాత్రమే కార్మికులను వాడుకుందని ఆరోపించారు. భారాస ప్రభుత్వం కొనసాగి ఉంటే సింగరేణిలో ఉద్యోగాల సంఖ్యను 42 వేల నుంచి 5 వేల మందికి కుదించేదని, ప్రస్తుతం ఆ ప్రమాదం లేదని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న గనులన్నీ సింగరేణికే చెందేలా కేంద్రంతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, ఒకప్పుడు సింగరేణిలో లక్షా 30 వేల మంది పనిచేసే వారని, ప్రస్తుతం ఆ సంఖ్య మూడు వంతులు తగ్గిందన్నారు. వేలం బిడ్డింగ్‌లో సింగరేణి పాల్గొనకపోవడం వల్లనే కొత్త గనులు రావడం లేదని అభిప్రాయపడ్డారు. వేలంలో పాల్గొనేలా సింగరేణిని ఆదేశించాలని సీఎంకు విన్నవించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, సంస్థ సీఎండీ బలరాం తదితరులు పాల్గొన్నారు.


 

  టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-I స్క్రీనింగ్ టెస్ట్  
 

1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు
4. పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ – నివారణ, ఉపశమనం కోసం వ్యూహాలు
5. భార‌తదేశ ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి
6. ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం
7. భారత దేశ చరిత్ర, సంస్కృతి – వారసత్వం
8. భారత ‌రాజ్యాంగం, రాజ‌కీయ వ్యవ‌స్థ
9. భారతదేశంలో ప‌రిపాల‌న‌, ప్రభుత్వ విధానాలు
10.తెలంగాణ రాష్ట్ర విధానాలు
11.తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
12.సామాజిక మిన‌హాయింపు/ వెలి ; లింగ, కుల‌, తెగ‌ల‌, వైక‌ల్యం మొద‌లైన హ‌క్కులు, స‌మ్మళిత విధానాలు

13.లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్


  ♦ పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు   


   నమూనా ప్రశ్నపత్రాలు   


 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.