• facebook
  • whatsapp
  • telegram

Education: అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’


 

ఈనాడు డిజిటల్, అమరావతి: అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్‌ మాగులూరి తెలిపారు. దీని ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో తెలుగు పాఠాలు బోధించనున్నట్లు పేర్కొన్నారు. మాతృభాషను విస్మరించిన ఏ జాతి మనుగడ సాగించలేదన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ‘తానా-పాఠశాల’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలకు తెలుగు పుస్తకాలు పంపిణీ చేశారు. తెలుగును భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు అన్నారు. అమెరికాలోని తెలుగువారిని ఓ గొడుగు కిందకు తెచ్చిన ఘనత తానాకు దక్కుతుందని ప్రశంసించారు. కార్యక్రమంలో యెండూరి సీతారామారావు, అవిర్నేని రమేష్, అలంపల్లి రవికుమార్‌ పాల్గొన్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.