• facebook
  • whatsapp
  • telegram

Triple IT admission: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల తుది జాబితా విడుదల


నూజివీడు పట్టణం, న్యూస్‌టుడే: ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంగణాల్లో ప్రవేశాలకు సంబంధించిన తుది జాబితాను గురువారం నూజివీడులో కులపతి ఆచార్య కేసీ రెడ్డి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘2024-25 విద్యా సంవత్సరం ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు 53,863 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ప్రాంగణానికి 1,000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద అదనంగా వంద సీట్లు కలిపి 4 ప్రాంగణాలను 4,400 మందితో భర్తీ చేస్తున్నాం. వీరిలో 85% మంది ఆంధ్ర విద్యార్థులు, 15% ఓపెన్‌ మెరిట్‌ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు కేటాయించాం. భర్తీ చేసిన సీట్లలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 92.99%, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 7.01% ఉన్నారు. వీరికి ఈ నెల 22, 23 తేదీల్లో నూజివీడు ప్రాంగణంలో, 22, 23-ఇడుపులపాయ, 26, 27-శ్రీకాకుళంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాం. ఒంగోలులో ఈ నెల 24, 25వ తేదీల్లో జరగాల్సిన కౌన్సెలింగ్‌ను ఇడుపులపాయలో నిర్వహించనున్నాం’ అని వివరించారు. పూర్తి వివరాలు ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌ ఉన్నాయని ప్రవేశాల సమన్వయకర్త అమరేంద్ర కుమార్‌ తెలిపారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.