• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APDEECET: ఏపీ డీఈఈసెట్‌-2024 

ఏపీ ప్రభుత్వం, పాఠశాల విద్యా విభాగం… 2024-25 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్‌)-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఈఈసెట్‌ ర్యాంకు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు/ ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మే 9వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మే 24న పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష వివరాలు:

* ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(డీఈఈఈసెట్‌)-2024

కోర్సు: డీఈఎల్‌ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)

అర్హతలు: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: కనిష్ఠంగా సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు. 

కేటగిరీ సీట్లు: మ్యాథమెటిక్స్- 25%, ఫిజికల్ సైన్స్- 25%, బయోలాజికల్ సైన్స్- 25%, సోషల్ స్టడీస్- 25%.

ఎంపిక ప్రక్రియ: డీఈఈఈసెట్‌లో సాధించిన ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.750.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పార్ట్-ఎ 60 మార్కులు- 60 ప్రశ్నలు, పార్ట్-బి 40 మార్కులు- 40 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.

ముఖ్య తేదీలు… 

డీఈఈసెట్‌-2024 నోటిఫికేషన్ విడుదల: 22.04.2024.

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు తేదీలు: 23.04.2024 నుంచి 08.05.2024 వరకు.

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 24.04.2024 నుంచి 09.05.2024 వరకు.

హాల్ టిక్కెట్ల జారీ: 21.05.2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 24.05.2024.

ఫలితాల ప్రకటన: 30.05.2024.

మొదటి కౌన్సెలింగ్‌కు వెబ్‌ ఐచ్ఛికాల నమోదు తేదీలు: 06.06.2024 నుంచి 08.06.2024 వరకు.

సీట్ల కేటాయింపు: 10.06.2024.

డైట్‌ల్లో ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 12.06.2024 నుంచి 15.06.2024 వరకు.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 23-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :