• facebook
  • whatsapp
  • telegram

Fall   out   with,  Gloat   over

Narayana: Why do you often borrow money from others? You ought to have put away enough money when you were earning (ఎందుకు నువ్వు అందరి దగ్గరా అప్పు తెచ్చుకుంటావు? నువ్వు సంపాదిస్తున్నపుడు చాలినంత డబ్బు పొదుపు చేసుకునుండవచ్చు కదా?)

Jayaram: Of course I did. But what I had saved, I had to spend on my son's education and my daughter's marriage (చేశాను, కానీ దాన్నంతా మా అమ్మాయి పెళ్లికి, మా అబ్బాయి చదువుకు ఖర్చు పెట్టేశాను).

Narayana: Why did you fall out with your brother? If you had been on good terms with him he would have helped you (అయితే నువ్వెందుకు మీ అన్నయ్యతో పోట్లాడావు? ఆయనతో సత్సంబంధాలతో ఉండుంటే నీకాయన సాయం చేసుండేవాడు కదా?)

Jayaram: He was furious with me for not helping him in the matter of his daughter's marriage. I was up to my neck in debts then, so I had to clear them all (ఆయనకు నామీద బాగా కోపం వచ్చింది, ఆయన కూతురు పెళ్లికి నేనేం సాయం చేయలేకపోయానని. అప్పుడు నేను అప్పుల్లో పీకలదాకా కూరుకుపోయాను, దాంతో వాటిని తీర్చాల్సి వచ్చింది).

Narayana: So, he now gloats over your difficulties. Is that it? (కాబట్టి ఆయన నీ కష్టాలను చూసి సంతోషపడుతున్నాడు, కదా).

Jayaram: Exactly. He is sour that I did not help him just when he needed my help. But I feel sorry that I let him down. He does not understand that (అదే కదా. ఆయనకు బాధగా ఉంది, నా అవసరం ఆయనకు ఉన్నప్పుడు నేనాయనకు సాయం చేయలేదని. కానీ నాకూ బాధగానే ఉంది ఆయనకు అవసరమైన సాయం నేను చేయలేకపోయానని. అది ఆయన అర్థం చేసుకోడు).

Narayana: Don't you worry. I will talk to him and make up the differences between you  (బాధపడకు. ఆయనతో నేను మాట్లాడి, మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు పోయేలా చూస్తాను).

Notes

1. put away = save (పొదుపు చేయడం).
2. furious = very angry (చాలా కోపంతో ఉండటం).

3. up to my neck in debts = totally in debts (పీకలదాకా అప్పులో ఉండటం).

4. Sour = actual meaning - bitter (బాధతో ఉండటం) But here it means anger or disappointment (కానీ ఇక్కడి అర్థం- కోపం, నిరాశ).

5. Make up with = compromise (రాజీ పడటం).

 

Now look at the following sentence:

1. Why did you fall out with your brother?

2. So he now gloats over his difficulties

3. I am sorry that I let him down

 

Now let us look at the phrasal verbs in detail:

1. fall out with = quarrel  (పోట్లాడుకోవడం).

a) Dinakar: Venkat and Vinayak are both silly. They quarrel over trifles (వెంకట్‌, వినాయక్‌ ఇద్దరూ చిన్నపిల్లల తరహా వాళ్లు. చిన్న చిన్న విషయాల మీద పోట్లాడుకుంటారు).

Paparao: They are no longer on talking terms. They fell out with each other over a silly matter Venkat asked for just a pen and Vinayak denied it (వాళ్లలో ఒకరికొకరికి మాటల్లేవు. ఏదో చిన్న విషయానికి వాళ్లు పోట్లాడుకున్నారు. వెంకట్‌ ఏదో పెన్‌ అడిగాడు, వినాయక్‌ ఇవ్వలేదు).

b) Prathap: The wife and husband always quarrel. They have not been able to see eye to eye with each other for quite some time now (ఆ మొగుడూపెళ్లాలు ఎప్పుడూ పోట్లాడుకుంటారు. కొంతకాలం నుంచి వాళ్లిద్దరికీ పొసగడం లేదు).

Sindhura: Inspite of their often falling out with each other, they are not divorced. Their marriage is intact (వాళ్లు ఇద్దరూ తరచూ పోట్లాడుకున్నప్పటికీ విడాకులు తీసుకోలేదు. వాళ్ల పెళ్లి ఇప్పటికీ గట్టిగానే ఉంది).

2. Gloat over = be happy about others' misfortunes  (ఇతరుల బాధకు మనం సంతోషపడటం).

a) Sekhar: If they know that Sunil is in troubles, they will be happy about it  (సునీల్‌ బాధల్లో ఉన్నాడని తెలిస్తే, వాళ్లు చాలా సంతోషిస్తారు).

Trinath: They will gloat over it. They are a bit sadistic by nature (అది వాళ్లను సంతోషపరుస్తుంది. వాళ్లు ఇతరుల బాధలో ఆనందం పొందే రకం).

b) Varun: Sunil is in troubles. He has lost his job (సునీల్‌ బాధల్లో ఉన్నాడు. అతని ఉద్యోగం పోయింది).

Rajaiah: You expect me to gloat over it, don't you? Though I have differences with him, I wish him well  (నేనేదో సంతోషపడతానని అనుకుంటున్నావు కదా? అతనితో నాకు మనస్పర్థలు ఉన్నప్పటికీ, అతని మంచినే కోరుకుంటా నేను).

3. Letting down - original form - Let somebody down = fail to help someone in times of need  (అవసరమైన సమయంలో సాయం చేయకపోవడం/ అవసరమైనప్పుడు సాయం చేయకపోవడం)

a) Somu: Ananth is very sorry for what happened yesterday, do you know? (నిన్న జరిగినదానికి అనంత్‌ చాలా విచారిస్తున్నాడు, నీకు తెలుసా?)

Venkat: What is he sorry for? He let me down when I most needed his help. Is that it? (ఎందుకంత విచారపడటం? నాకతని సాయం బాగా అవసరమైనప్పుడు నాకు సాయం చేయలేదతను. అందుకనా?)

b) Sarada: I will be out of town for a few days. When exactly do you need my help? (నేను కొన్నిరోజులు వూళ్లొ ఉండను. కచ్చితంగా ఎప్పుడు నీకు నా సాయం కావాలి?)

Chandana: That will be after you return. I know you will not let me down. You are very reliable (అది నువ్వు వూరి నుంచి వచ్చిన తరువాతలే. నాకు తెలుసు, నువ్వు నన్ను నట్టేట ముంచవని, నువ్వ ఆధారపడ తగ్గదానివని).

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం