• facebook
  • whatsapp
  • telegram

Kick in, Wear off  

ఇంగ్లిష్‌ రాతలో, సంభాషణల్లో Phrasal verbs ను ఉపయోగించడం వల్ల భాష సహజంగా ఉంటుంది. కొన్నింటిని ఉదాహరణల సాయంతో నేర్చుకుందాం!

Rohith: You know I have chronic headache. The doctor I consulted prescribed a medicine (నీకు తెలుసుకదా, నాకు నయంకాని తలనొప్పి వస్తుందని. నేను సంప్రదించిన డాక్టర్‌ నాకొక మందు ఇచ్చాడు).

Subhankar: Will that have any effect? Hope at least this will give you some relief (దానికైనా ఏమైనా ప్రభావం ఉంటుందా? ఇదైనా నీకు కాస్త నివారణ కలిగిస్తుందని ఆశిస్తున్నా).

Rohith: He said that I would have to wait for a few days for it to kick in, at least two to three days (ఆయన నాతో కొన్ని రోజులాగండి, అప్పుడది ఫలితం చూపిస్తుంది, కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది అని అన్నాడు).

Subhankar: Hope it wouldn't have any adverse effect on your health. You will start griping at it again (అది నీ ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపదు కదా? అప్పుడు నువ్వు మళ్లీ గొడవపెడుతుంటావు).

Rohith: Yea, you are right. But this doctor is different. He assured me that it would be right remedy for my complaint (అవును అది నిజమే. కానీ ఈ డాక్టర్‌ వేరు. ఈయన నాకు హామీ ఇచ్చాడు, నా బాధకు అది సరైన మందని).

Subhankar: Hope you won't become an addict to it (నువ్వు దానికి అలవాటు పడవని ఆశిస్తున్నా).

Rohith: No. The doctor assured me that its effect will wear off as soon as I stop taking it (డాక్టర్‌ నాకు హామీ ఇచ్చాడు, దానిని తీసుకోవడం ఆపిన వెంటనే, దాని ప్రభావం ఉండదని).

Subhankar: I wish you would be cured soon (నీకు త్వరగా నయమవ్వాలని నా కోరిక).

Rohith: Thanks a lot. I see you are already nodding off. Time you went to bed. Good night (ధన్యవాదాలు. నువ్వు తూగడం నేను గమనిస్తున్నా. నువ్వు నిద్రించాల్సిన సమయం వచ్చేసింది. శుభరాత్రి).

1. Kick in = Take effect (especially of a medicine) (మందు పనిచేయడం).

Anand: How is your father's health? Is he recovering? (మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన కోలుకుంటున్నాడా?)

Baburao: There is no improvement. We have taken him to a number of doctors, but their medicines have not kicked in (ఏమీ మెరుగుపడలేదు. చాలామంది వైద్యులకు చూపించాం, కానీ వాళ్ల మందులేవీ పనిచేయలేదు).

2. Wear off = lose effect (ప్రభావం కోల్పోవడం).

Sunil: I am sure his interest will not last long in business. He is not cut out for it (వ్యాపారంలో అతని ఆసక్తి అట్టే కాలం నిలవదు. దానికి అతను సరిపోడు).

Viswanath: I agree with you. His interest will wear off soon. I only wish that he wouldn't lose any money (నువ్వు చెప్పేది నేను ఒప్పుకుంటున్నా. వ్యాపారంలో అతని ఆసక్తి త్వరలోనే తగ్గిపోతుంది. నేను కోరుకునేదంతా తాను డబ్బు పోగొట్టుకోకూడదని).

3. Nodding off - the present participle of nod off = doze / sleep for a short period unintentionally (కునికిపాట్లు పడటం/ ఉద్దేశం లేకుండా తక్కువ వ్యవధి నిద్ర).

a) Vinod: I was talking to Ramesh last night. He suddenly dozed off (రమేష్‌తో నిన్న రాత్రి మాట్లాడుతున్నా. ఉన్నట్టుండి తూగుతున్నాడు).

Srikanth: That is the trouble with him. He cannot keep awake after 10 at night. He nods off even if you are talking (అతనితో చిక్కే అది. వాడు రాత్రి పది దాటిన తర్వాత మేల్కొని ఉండలేడు. నువ్వు మాట్లాడుతుండగానే తనకు తెలియకుండానే కునికిపాట్లు పడతాడు).

b) Sankar: Will Nagaraju be awake at this hour of the night? I want to talk to him about a serious matter (నాగరాజు రాత్రి ఈ సమయంలో మేల్కొని ఉంటాడా? ఒక ముఖ్య విషయం గురించి వాడితో మాట్లాడాలి).

Subbaarao: No doubt. You can talk to him. He never even nods off thought it is late in the night (సందేహం లేదు. నువ్వు అతనితో మాట్లాడొచ్చు. రాత్రి ఎంత ఆలస్యమైనా అతను తూగను కూడా తూగడు)

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం