• facebook
  • whatsapp
  • telegram

Back handler ...  Booby trap

ఇంగ్లిష్‌ భాషపై పట్టు సాధించాలంటే Phrasal verbs తెలుసుకుంటూ ఉండాలి. ఈ వారం రెండు వ్యక్తీకరణలను పరిచయం చేస్తూ, వాటిని సంభాషణల్లో ఎలా ఉపయోగించ వచ్చో ఉదాహరణలతో ఇస్తున్నాం. వీటిని సంభాషణల్లో ప్రయోగించడానికి ప్రయత్నించండి.

Sekhar: Hi, friend, how are you getting on? Long time since we met (హాయ్‌ మిత్రమా, ఎలా ఉన్నావు? కలుసుకుని చాలా రోజులైంది).

Jayaram: That is true. I have been busy all these days with something or the other(అది నిజమే. నేను ఈమధ్య ఏదో ఒకదానితో తీరిక లేకుండా ఉన్నాను).
 

Sekhar: You know Suryarao, I think. He gave the official a back handler so that he may succeed in getting him a job. But the official was uncorrupt and he did not accept the bribe (సూర్యారావు నీకు తెలుసనుకుంటా. అతను ఒక ఆఫీసర్‌కు దొంగతనంగా డబ్బు చెల్లించి ఉద్యోగం పొందాలనుకున్నాడు. కానీ, ఆ ఆఫీసర్‌ చాలా నిజాయతీపరుడు. సూర్యారావు ఇచ్చిన లంచాన్ని అతను స్వీకరించలేదు).
 

Jayaram: I know what he has done. He set up a booby trap for the official so that he may lose his life (నాకు తెలుసు వాడేం చేశాడో. అతను ఆ ఆఫీసర్‌కు ఒక పేలుడు పదార్థాన్ని పెట్టి చంపాలని చూశాడు).
 

Sekhar: Suryarao is a real villain. He will go to any extent to get the job and be in it (సూర్యారావు నిజమైన దుర్మార్గుడు. అతను ఎంతకైనా తెగిస్తాడు, ఆ ఉద్యోగాన్ని పొందేందుకు).
 

Jayaram: That is the trouble with Suryarao. He always thinks of himself and never allows anyone to deprive him of his chances (అదే సూర్యారావుతో వచ్చిన చిక్కు. అతనెప్పుడూ తన గురించే ఆలోచిస్తాడు, ఇతరులు తన అవకాశాన్ని దక్కించుకోకుండా చూస్తాడు).
 

Sekhar: He is very selfish (అతను చాలా స్వార్థపరుడు).
 

Jayaram: He always scotches the plan and never allows anyone to come near him. He is very selfish and does not bother about the others (అతనెప్పుడూ తన పథకాన్ని ఎవరూ పాడు చేయకుండా చూసుకుంటాడు. చాలా స్వార్థపరుడు. ఇతరుల గురించి ఆలోచించడు).
 

Sekhar: Yes, of course' (అవును, నిజమే).
 

Look at the following words from the conversation:
 

1. Back handler = Illegal payment / to corrupt someone(లంచం ఇవ్వడం/ ఇతరులకు ఆశ చూపించడం). 
e.g.: He gave the official a back handler so that he may get the job.

Ramesh: The official is very corrupt. Pay him some money and he will get you a job (ఆ ఆఫీసర్‌ చాలా లంచగొండి. అతనికి డబ్బు ఇవ్వు, నీకు ఏదో ఒక ఉద్యోగం చూపిస్తాడు).
 

Radhakrishna: Is he so corrupt? Then I will pay him a back handler so that I may get the job (అంత లంచగొండా అతను? అయితే నేను అతనికి డబ్బు ఎరగా చూపి, ఉద్యోగం పొందుతాను).
 

2. Booby trap = An explosive device designed to explode when an unsuspected victim walks over it (పేలుడు పదార్థం పెట్టి, ఒకరు చనిపోయేట్టు చూడటం).
 

Anand: I know what you have done. You set up an explosive device so that the officer may die (నాకు తెలుసు నువ్వేం చేశావో. నువ్వు ఒక పేలుడు పదార్థం పెట్టావు, ఆ ఆఫీసర్‌ చనిపోవడానికి).
 

Lakshmikanth: No, I didn't do anything of the sort. I did not set up a booby trap so that the officer may be killed. I just wanted to get the job, which is all (నేను అలాంటిదేమీ చేయలేదు. ఆ ఆఫీసర్‌ చనిపోవడానికి నేను పేలుడు పదార్థమేమీ పెట్టలేదు. ఆ ఉద్యోగం రావాలని అనుకున్నాను. అంతే).

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌