• facebook
  • whatsapp
  • telegram

Count on, Let us down

ఇంగ్లిష్‌లో రాసేటప్పుడూ, మాట్లాడేటప్పుడూ సరైన PHRASAL VERBS ఉపయోగిస్తే... చెప్పదల్చుకున్న భావం మెరుగ్గా ఉంటుంది. ఇప్పుడు Count on, Let us down ల అర్థం, వాటి ప్రయోగం గురించి ఉదాహరణలతో తెలుసుకుందాం!

Lakshman: How goes life, my dear friend? Long time since we met.

(జీవితం ఎలా సాగుతోంది మిత్రమా? మనం కలుసుకొని చాలా రోజులయింది)
 

Rajesh: How do you do? We have met three months ago, and we are meeting now.

Ù(నువ్వెలా ఉన్నావు? మనం మూడు నెలల క్రితం కలుసుకున్నాం. మళ్లీ ఇప్పుడు కలుసుకుంటున్నాం)
 

Lakshman: I found my friend Narasimham who I came across yesterday. I had to count on him for what he did to me. He is very reliable.

(నరసింహాన్ని నిన్న నేను కలుసుకున్నాను. నేనతని మీద ఆధారపడాల్సి వచ్చింది, అతను నాకు చేసిపెట్టాడు. చాలా ఆధారపడతగ్గవాడతడు)
 

Rajesh: Why did you go to him? He is really very friendly and can be depended upon.

(ఎందుకు నువ్వు అతని దగ్గరికి వెళ్లావు? అతను చాలా మంచి స్నేహితుడు, ఆధారపడదగ్గవాడు కూడా)
 

Lakshman: He very recently got over from his illness. He is still weak. But we can depend on him to help us a lot.

(ఈమధ్యనే అతను తన జబ్బు నుంచి కోలుకున్నాడు. ఇంకా బలహీనంగా ఉన్నాడు. కానీ సాయం విషయంలో అతనిమీద మనం చాలా ఆధారపడవచ్చు.)
 

Rajesh: Our friend Kiran is totally unreliable. He often lies and cheats us a lot. He often lets us down and does not care about us.

(మన స్నేహితుడు కిరణ్‌ అస్సలు ఆధారపడతగినవాడు కాదు. ఎప్పుడూ మనలను ఆధారపడనీకుండా వదిలేస్తాడు, మనం అంటే అతనికి లక్ష్యమే లేదు)
 

Lakshman: That is so. He is very undependable and often lies. He is very sure of what he does and does not care for us.

(అవును అతనంతే. అతనేం ఆధారపడదగ్గవాడు కాదు, బాగా అబద్ధాలు చెప్తాడు. అతనెప్పుడూ మనలను లక్ష్యపెట్టడు)
 

Rajesh: He is so. He turns me off whenever he tries to tell us a story that is not at all worth listening.

(అవును, అతనంతే. అతనెప్పుడూ మనలను వదిలేస్తుంటాడు, అతను చెప్పే కథలన్నీ వినడానికి ఇష్టపడం, అన్నీ అబద్ధాలే)
 

Lakshman: That is so. He is totally worthless. He does not know what he does .

(అది నిజమే. అతనికి ఏ విలువా లేదు. అతను ఏం చెప్తాడో, అతనికే తెలీదు.)
 

Look at the following words from the conversation
 

1. Count on = Depend on, Reliable = highly dependable.
 

Lakshmikanth: Our friend Krishna is someone who we can always rely upon. He is totally dependable.

(మన స్నేహితుడు కృష్ణ, మనం బాగా ఆధారపడతగినవాడు. అతని మీద మనం ఆధారపడవచ్చు)
 

Ramarao: Yes, you can say that again and again. He is someone who we can always count on to help us.

(అవును. నువ్వది మళ్ళీ, మళ్ళీ చెప్పవచ్చు. అతని మీద మనం ఆధారపడవచ్చు, మనకెప్పుడు సాయం అవసరమైనా)
 

2. Let us down = Fail to support or help.
 

Sekhar: Our friend Madhavarao is always unreliable. He cannot keep his word and often lets us down.

(మన స్నేహితుడు మాధవరావు అంత ఆధారపడతగినవాడు కాదు. తన మాటను నిలుపుకోడు, మనలను ఎప్పుడూ వదిలేస్తుంటాడు)
 

Sankar: That is true. He is totally unreliable. He often lets us down in times of need and never helps us.

(అది నిజమే. అతనెప్పుడూ అంత ఆధారపడతగినవాడు కాదు. అతనెప్పుడూ మన అవసర విషయాలలో వదిలేస్తుంటాడు, ఎప్పుడూ సాయం చేయడు)

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌