• facebook
  • whatsapp
  • telegram

Chickened out,  Flipped out

Chickened out, Flipped out.. వీటి గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ Phrasal Verbs ఆటకు సంబంధించిన వాటిలాగా అనిపిస్తున్నాయి కదా! నిజానికి ఇవి భావోద్వేగాలకు సంబంధించినవి. వాటి గురించీ, వాటిని సంభాషణల్లో ఉపయోగించే విధానాన్నీ తెలుసుకుందామా?
 

Nagesh: How goes life, dear friend? (జీవితం ఎలా ఉంది మిత్రమా?)
 

Jayanth: It is just yesterday we met. Why ask me ‘how goes life'? I suppose you are too forgetful (నిన్ననే కదా మనం కలుసుకున్నది. అప్పుడే జీవితం ఎలా సాగుతోందని అడుగుతావేంటి? నీకు మతిమరుపు ఎక్కువనుకుంటా).
 

Nagesh: Our friend Kishore thought of fighting with Subbarao, but in the last minute he chickened out. He is too nervous (మన మిత్రుడు కిశోర్‌ సుబ్బారావుతో పోట్లాడాలనుకున్నాడు. కానీ చివరి క్షణంలో భయపడి వెనక్కి తగ్గాడు. అతనికి పిరికితనం ఎక్కువ).
 

Jayanth: He is always like that. He is a coward. He cannot fight with anybody (అతనెప్పుడూ అంతే. పిరికివాడు. ఎవరితోనూ పోట్లాడలేడు).
 

Nagesh: Another thing: he broke the glass jug that was in his hand. He threw it down and it came apart (ఇంకో విషయం: అతను నిన్న తన చేతిలో ఉన్న గాజు జగ్‌ను ముక్కలు చేశాడు. కింద పడేయడంతో అది ముక్కలు ముక్కలైంది).
 

Jayanth: He is always like that. He cannot hold anything for some time. He is very careless and does not know what he does (అతనెప్పుడూ అంతే. దేన్నీ కొంచెంసేపు కూడా పట్టుకుని ఉండలేడు. చాలా అజాగ్రత్తపరుడు. అతనేం చేస్తాడో తనకే తెలియదు).
 

Nagesh: Further he flipped out and was quite angry with himself for breaking the glass jug (అంతేకాదు.. భావోద్వేగాల మీద అదుపు కోల్పోయి, ఆ గాజు జగ్‌ను ముక్కలు చేసినందుకు తన మీద తనే కోపించుకున్నాడు).
 

Jayanth: He cannot manage anything. I don't know what the trouble with him is. Something is wrong with him. He had better consult a neurologist or a psychologist (దేన్నీ సరిగా చూసుకోలేడు. అతనికున్న సమస్యేమిటో నాకర్థం కాలేదు. అతను నరాలకు సంబంధించిన వైద్యుడినో, సైకాలజిస్టునో కలిస్తే మంచిది).
 

Nagesh: I told him so. He refused to see either of them (అతనికి నేనదే చెప్పాను. ఆ ఇద్దరిలో ఎవరిని కలవడానికీ అతను ఇష్టపడలేదు).
 

Jayanth: I really pity him. Even the members of his family do not take care about him (అతన్ని చూస్తే నిజంగా జాలేస్తుంది. అతని కుటుంబ సభ్యులు కూడా అతని గురించి పట్టించుకోరు).
 

Now look at the following sentences
 

1. our friend thought of fighting with Subbarao, but in the last minute he chickened out (మన మిత్రుడు సుబ్బారావుతో పోట్లాడాలనుకున్నాడు. కానీ చివరి క్షణంలో భయపడి వెనక్కి తగ్గాడు).
 

Chickened out - the past tense of chicken out = Stop doing something out of fear (భయంతో ఏదీ చేయలేకపోవడం).
 

Santhosh: Mahesh was very angry with Prasad for deceiving him. He thought of settling the matter with Prasad, but in the last minute he withdrew his idea out of fear. He is always afraid of others (తనను మోసం చేసినందుకు మహేశ్‌ ప్రసాద్‌పై చాలా కోపంగా ఉన్నాడు. అతనితో పోట్లాడాలనుకున్నాడు కానీ, చివరి క్షణంలో పిరికితనంతో పోట్లాట మానుకున్నాడు. అతనెప్పుడూ ఇతరులంటే భయపడతాడు).
 

Sameer: He is a coward. He always chickens out. He is often very nervous. I think he had better see a doctor (అతను పిరికివాడు. ఏ విషయమైనా భయపడతాడు. ఎప్పుడూ అతనికి భయమే. ఎవరైనా డాక్టర్ని సంప్రదిస్తే మంచిదనుకుంటా).
 

2. Flipped out - the past tense of flip out = Lose control over your feelings and emotions (మన భావోద్వేగాల మీద మనకు అదుపు లేకపోవడం).
 

Sekhar: Mohan thought of fighting with Kumar, but in the last minute he avoided the fight (మోహన్‌ కుమార్‌తో పోట్లాడాలనుకున్నాడు కానీ, చివరి క్షణంలో పోటీ వదిలేశాడు).
 

Subhash: He is always like that. He gets prepared to fight with someone, and he flips out. He loses control of himself (వాడెప్పుడూ అంతే. ఇతరులతో పోట్లాడటానికి సిద్ధపడతాడు. తన భావోద్వేగాల మీద తనకు అదుపే ఉండదు).

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌