• facebook
  • whatsapp
  • telegram

Give a talking to, Eat humble pie

పొరపాటు చేసి, దానికి క్షమాపణ చెప్పే సందర్భం మనకైనా, మన స్నేహితులకైనా వస్తుంటుంది. ఆ పరిస్థితిని సూచించే సముచితమైన వ్యక్తీకరణ ఇంగ్లిష్‌లో ఉంది. ఆ PHRASAL VERB ఏమిటి? అలాగే తిట్టటానికీ, తీవ్రంగా విమర్శించటానికీ మరికొన్ని వ్యక్తీకరణలు ఉపయోగిస్తాం. వీటి గురించి తెలుసుకుందామా?

Anirudh: I called on our friend Bhaskar last evening. I heard his father scolding him for something he had done (నేను నిన్న భాస్కర్‌ను కలవడానికి వాళ్లింటికి వెళ్లాను. వాళ్ల నాన్న అతను చేసిందానికి కేకలేయడం విన్నాను).

Virat: That is always the trouble. Bhaskar's father is very short-tempered. He flares up even at the small mistakes Bhaskar does (ఎప్పుడూ అదే ఇబ్బంది. భాస్కర్‌ వాళ్ల నాన్న చాలా సులభంగా కోప్పడతాడు. భాస్కర్‌ చేసే చిన్న తప్పులకు కూడా ఆయన ఎగిరి పడుతుంటాడు).
 

Anirudh: I heard his father giving him a talking to. Bhaskar bore it with all patience. He is a guy with understanding (వాళ్ల నాన్న అతన్ని తీవ్రంగా విమర్శించడం నేను విన్నాను. కానీ భాస్కర్‌ ఓపికతో భరించాడు.అవగాహన ఉన్నతను).
 

Virat: It seems even at the office his father is very temperamental. He lacks self-control (ఆఫీసులో కూడా భాస్కర్‌ వాళ్ల నాన్న రికే కోప్పడుతూ ఉంటాడట. తన మీద అదుపులేదట).
 

Anirudh: My father is his colleague and, he tells me the same. Sometimes because of his short-tempered nature he has to eat a humble pie (మా నాన్న ఆయన సహోద్యోగి, మా నాన్న కూడా అదే అంటాడు. కొన్నిసార్లు ఆయన సులభంగా కోప్పడటం వల్ల దాని ఫలితాలు అనుభవించి క్షమాపణలు చెప్పుకుంటాడట).
 

Virat: In spite of his age, he hasn't learned. He has a lot of experience too (అంత వయసుండి కూడా ఆయన నేర్చుకోలేదు. ఆయన అనుభవం కూడా ఎక్కువే).
 

Anirudh: But very often he tells Bhaskar to mind his 'p's and 'q's. He doesn't need that kind of warning. Bhaskar takes after his mother and is very balanced (కానీ తరచుగా ఆ భాస్కర్‌తో అంటుంటాడట, జాగ్రత్తగా నడుచుకోమని. కానీ భాస్కర్‌కు ఆ హెచ్చరిక అక్కర్లేదు. అతనికి వాళ్లమ్మ పోలిక, చాలా సౌమ్యంగా ప్రవర్తిస్తాడు).
 

Virat: We must appreciate Bhaskar for his patience. He bears with his father (భాస్కర్‌ ఓర్పుకు మెచ్చుకోవాలి. వాళ్ల నాన్న అతన్ని ఏమైనా భరిస్తాడు).
 

Now let us look at the expressions in detail
 

1. Give a talking to = scold / criticize severely (తిట్టడం/ విమర్శించడం).
 

Venkat: Yesterday the teacher scolded Ramana for no fault of his. It was the boy sitting next to Ramana that made the noise (నిన్న మన టీచర్‌ రమణను ఏ తప్పూ చేయకపోయినా తిట్టాడు. రమణ పక్కన ఉన్నవాడు గొడవ చేశాడు).
 

Viswam: The teacher is always so. He often barks up the wrong tree. Ramana cried when the teacher gave him a talking to (ఆ టీచర్‌ ఎప్పుడూ అంతే. తప్పు చేయనివాళ్ల మీదనే విరుచుకుపడతాడాయన. పాపం, రమణ ఏడ్చాడు, టీచర్‌ విమర్శించినందుకు).
 

2. Eat humble pie = Suffer humiliation / suffer the consequences of a mistake and be forced to apologize (అవమానం పాలవడం/ చేసిన పొరపాటుకు క్షమాపణ చెప్పే పరిస్థితి తెచ్చుకోవడం).
 

Raghav: Ekambaram accused Prasad for no fault of his. Later, of course, he realized he found fault with Prasad wrongly (ఏ తప్పూ చేయకపోయినా ప్రసాద్‌ను ఏకాంబరం తిట్టాడు. తర్వాత తెలుసుకున్నాడు, తాను ఏ తప్పూ చేయని ప్రసాద్‌ను తిట్టాడని).
 

Sagar: Yea, I was told he had to eat humble pie for that. He had to ask Prasad to excuse him (అవును. నాకెవరో చెప్పారు, దానికి అతను తాను చేసిన పొరపాటు ఫలితాలు అనుభవించాల్సి వచ్చిందని. ప్రసాద్‌ను అతను క్షమాపణ కోరాల్సి వచ్చింది).
 

3. Mind your 'p's and 'q's = Behave politely (మర్యాదతో ప్రవర్తించడం).
 

Sunil: I am surprised that Prabhakar has impeccable manners. Considering his family back-ground it is a surprise (ప్రభాకర్‌కు అంత మంచి నడవడి ఎలా వచ్చిందో నాకాశ్చర్యమే. వాడి కుటుంబ నేపథ్యానికి వాడలా నడుచుకోవడం వింతే).

Pasha: It is a fact. He always minds her 'p's and 'q's, and wins the appreciation of all (అది నిజమే. అతనెప్పుడూ చాలా మర్యాదగా ప్రవర్తిస్తాడు, అందరి మెప్పునూ పొందుతాడు).
 

ఎం.సురేష‌న్‌

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌