• facebook
  • whatsapp
  • telegram

Beef up, Fall apart

Beef up one's plans, Fall apart ... ఈ Phrasal verbs ( ఎప్పుడైనా విన్నారా? వీటి అర్థం, ఏ సందర్భంలో వీటిని ఏ రకంగా ప్రయోగించాలో ఉదాహరణల సాయంతో తెలుసుకుందామా?

Prakash: I do not know what happened to Prasanth. It is weeks since I saw him. He said he would help in my work but he is not to be seen at all (ప్రశాంత్‌కు ఏమైందో నాకు తెలీదు. నేను అతన్ని చూసి కొన్ని వారాలైంది. అతను నాకు నా పనిలో సాయం చేస్తానన్నాను. కానీ కనిపించడమే లేదు).

Prasad: He is very busy with his sister's marriage. Once the marriage is over he will certainly meet you and help you in your work (అతను తన చెల్లెలి పెళ్లి విషయంలో తీరిక లేకుండా ఉన్నాడు. పెళ్లి అయిపోయిన వెంటనే నీకు సాయం చేస్తాడు).

Prakash: He promised to me that he would beef up my plans but he is not to be seen at all. I now understand that he is busy with his sister's marriage (నా ప్రణాళికలో మంచి మార్పులు తీసుకువస్తానని అతను నాకు మాట ఇచ్చాడు. అయితే కనిపించడం మానేశాడు. ఇప్పుడు అర్థమవుతోంది. తాను తన చెల్లెలి పెళ్లి విషయంలో తీరిక లేకుండా ఉన్నాడని).

Prasad: He will certainly help you. Don't worry. His plans for his sister's marriage fell apart and he is no end worried about it. He is unable to secure the money needed for the dowry (అతను నీకు తప్పక సాయం చేస్తాడు. తన చెల్లెలి పెళ్లి విషయంలో అతని ప్రణాళిక తలకిందులైంది. దాని గురించి అతను బాధగా ఉన్నాడు. తన చెల్లెలి పెళ్లికి కావాల్సిన డబ్బు తేలేకపోతున్నాడు).

Prakash: I do understand his problems. He is, I think, very much worried about it. All right. He will surely help me once his sister's marriage is over (అతని సమస్య నాకు అర్థమైంది. అతను ఆ విషయంలో దిగులుగా ఉన్నాడనుకుంటా. అతని చెల్లెలి పెళ్లి అయిపోయాక నాకు తప్పకుండా సాయం చేస్తాడు).

Look at the following phrasal verbs:

1) Beef up one's plans = Make changes / improvements in one's plans (పథకాల్లో మార్పులు, అభివృద్ధి చేయడం).

Damodar: Vasanth promised to help me in my plans, but it is weeks since I saw him (వసంత్‌ నా పథకాల్లో నాకు సాయం చేస్తానన్నాడు. కానీ నేనతన్ని కలుసుకుని వారాలైంది).

Swamy: He is quite busy with his own work. He has to submit his research thesis in a week or two. Once that is over he will certainly beef up your plans (అతను తన పనితో తీరికలేకుండా ఉన్నాడు. అతను తన పరిశోధన వ్యాసాన్ని ఒకటి, రెండు వారాల్లో పూర్తిచేయాలి. అది పూర్తయిన వెంటనే నీ ప్రణాళికలను మెరుగు చేయడంలో నీకు సాయం చేస్తాడు).

2) Fall apart = When something breaks all at once piece by piece (ఏదైనా ముక్కలు ముక్కలుగా పగిలిపోవడం).

Kumar: Ramana is planning to go abroad, but he is not able to secure enough money for his trip (రమణ విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడు. కానీ దానికి కావాల్సిన డబ్బును అతను సేకరించ లేకపోతున్నాడు).

Sarath: Unfortunately his plans have fallen apart. His mother has died and he is to take care of his family. So there is no chance of his going abroad (దురదృష్టవశాత్తూ అతని ఆశలు భగ్నమయ్యాయి. అతని తల్లి చనిపోయింది. ఇంటి బాధ్యతలను చూసుకోవాల్సి వస్తోంది. అందుకని అతను విదేశాలకు వెళ్లే అవకాశం లేదు).

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌