• facebook
  • whatsapp
  • telegram

To be out  to, Crack down on

ఇంగ్లిష్‌ సంభాషణల్లో Phrasal verb ను ఉపయోగించడం వల్ల భాష సహజంగా ఉంటుంది. కొన్నింటిని ఉదాహరణల సాయంతో నేర్చుకుందాం!

Syam: Hi Praveen, we havenÕt met for a long time. Where have you been all these days? (హాయ్‌ ప్రవీణ్‌, మనం చాలా రోజులుగా కలుసుకోలేదు. ఎక్కడున్నావు ఇన్ని రోజులు?)

Praveen: I had been to my uncle's place. His son got involved in a case he had nothing to do with. His so-called friend was out to see him put in the jail (నేను మా మామయ్య దగ్గరున్నా. తనకు సంబంధం లేని కేసులో వాళ్లబ్బాయి ఇరుక్కున్నాడు. అతని మిత్రుడుగా చెప్పుకునేవాడు అతన్ని జైల్లో చూడాలనే ప్రయత్నంలో ఉన్నాడు).

Syam: Had he an axe to grind or what? (వాడికి మీ మామ కొడుకు మీదేమైనా కక్ష ఉందా?)

Praveen: Sure, he had. My cousin did not help him in something illegal, so his friend became vengeful (కచ్చితంగా ఉంది. చట్ట విరుద్ధమైన విషయంలో మావాడు అతనికి సాయం చేయలేదు. అందుకని వాడు కక్ష పెంచుకున్నాడు).

Syam: Perhaps your cousin had to go through hell, and so did his father (అయితే మీవాడు నరకం అనుభవించి ఉంటాడు, వాళ్ల నాన్న కూడా).

Praveen: He stuck up for his stand that he was innocent. The sub-inspector refused to believe it (తాను అమాయకుడినని వాడి మాటమీద వాడు నిలబడ్డాడు. ఆ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నమ్మడానికి సిద్ధంగా లేడు).

Syam: The same thing happened to my brother-in-law, you know. The police were about to crack down on his family, but he had connections and wriggled out of the situation (మా బావమరిదికీ ఇలాగే జరిగింది, తెలుసా. పోలీసువాళ్లు వాడి కుటుంబం మీద విరుచుకుపడబోయారు కానీ, అతనికి పెద్దవాళ్లతో సంబంధం ఉండటంతో ఆ చిక్కు నుంచి బయటపడ్డాడు).

Praveen: This is India you know. Anybody can be bought very easily (ఇది భారతదేశం కదా. ఎవరినైనా సులభంగా కొనేయొచ్చు).

Syam: I am happy that you could save your cousin. Congrats! (నువ్వు మీ మామ కొడుకును రక్షించావు. అభినందనలు).

Notes:

1. Nothing to do with = no connection with (సంబంధం లేని).

2. Vengeful = desirous of taking revenge (పగ తీర్చుకోవాలనే కోరిక).

3. Wriggle out = Get out of a difficulty (చిక్కులనుంచి బయటపడటం).

4. Go through = Experience (అనుభవించడం). It has other meanings too (ఇతర అర్థాలు కూడా ఉన్నాయి).

Now look at the following sentences from the conversation above:

1) His so-called friend was out to see him in jail.

2) The police were about to crack down on his family

3) He stuck up for his stand that he was innocent.

1) To be out to = Try hard to (తీవ్ర ప్రయత్నం చేయడం).

a) Vinai: Where were you in the morning? (నువ్వివ్వాళ పొద్దున ఎక్కడున్నావు?)

Varun: I had been to my cousinÕs place. I was out to convince him to buy the house his father had chosen (మా బాబాయి వాళ్ల అబ్బాయి ఇంట్లో ఉన్నాను. వాళ్ల నాన్న ఎంపికచేసిన ఇల్లు కొనమని నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నాను).

b) Sagar: When did you see Prakash last? And what was he doing then? (ప్రకాష్‌ను నువ్వు చివరగా ఎప్పుడు చూశావు? అతను అప్పుడు ఏం చేస్తున్నాడు?)

Karuna: It was a week ago. He was then busy, out to win the match (వారం క్రితం. అతనప్పుడు చాలా తీరిక లేకుండా ఉన్నాడు, పోటీ గెలిచే ప్రయత్నంలో).

2) Crack down on = be tough in enforcing laws (చట్టాన్ని ప్రయోగించడంలో చాలా నిక్కచ్చిగా ఉండటం).

a) Peter: There was a huge demonstration in your area, I heard. What happened? (మీ ప్రదేశంలో పెద్ద ఆందోళన జరిగినట్టు విన్నాను. ఏం జరిగింది?)

Kabir: The police cracked down on the demonstrators. Several of the demonstrators were injured (ఆ ప్రదర్శకుల మీద పోలీసులు విరుచుకుపడ్డారు. వాళ్లలో చాలామంది గాయపడ్డారు).

b) Raju: The people were protesting against the police for the death of a person in the lock-up (పోలీస్‌ లాక్‌అప్‌లో ఓ వ్యక్తి చనిపోవడంతో ప్రజలు నిరసన తెలిపి, ప్రదర్శనలు చేశారు).

Rahim: But that was no use. The police kept their peace, and did not crack down on the protesters (కానీ అదేం ఫలించలేదు. పోలీసులు శాంతంగానే ఉన్నారు, నిరసనకారుల మీద విరుచుకుపడలేదు).

3) Stuck up for the past tense of stick up for = support / defend a person / a matter (ఒకరిని సమర్థించడం).

a) Sitharam: I donÕt exactly know what happened. But when I reached the scene, he was blaming her (అసలేం జరిగిందో నాకు తెలీదు. కానీ నేనక్కడికి చేరేటప్పటికే ఆమెను అతను తిడుతున్నాడు).

Doraswamy: Her husband stuck up for her, but his father got angry and shouted at both of them (వాళ్లాయన ఆమెను సమర్థించాడు గట్టిగా, కానీ వాళ్ల నాన్నకు కోపం వచ్చి ఇద్దరినీ తిట్టాడు).

b) Kesavarao: the teacher blamed the students for the disturbance in the class, and named some students (ఆ టీచరు క్లాసులో గొడవకు కారణమని కొంతమంది పేర్లు చెప్పి వాళ్లను తిట్టాడు).

Gangadhar: But all the students stood united, and stuck up for the students the teacher had named (అయితే విద్యార్థులందరూ ఐకమత్యంతో ఉండి, టీచరు చెప్పిన పేర్లున్న వాళ్లని సమర్థించారు).

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌