• facebook
  • whatsapp
  • telegram

To get back at some body

చౌక వస్తువులు కొనే అలవాటు కొందరికి ఉంటుంది. సాధారణంగా అవి లోపాలతో ఉండి, సరిగా పని చేయకుండా సతాయిస్తుంటాయి. ఇలా లోపాలతో ఉన్నదాన్ని కొనడం గురించి ఇంగ్లీషులో ఆసక్తికరమైన వ్యక్తీకరణ ఉంది. అదేమిటో తెలుసుకుందామా?
 

1. Buying a lemon - the original form: to buy a lemon = buy something defective (లోపాలతో ఉన్నదాన్ని కొనడం).

a) Sagar: The TV he bought is not functioning well. He has been cheated (వాడు కొన్న టీవీ సరిగా పనిచేయడం లేదు. వాడు మోసపోయాడు).
 

Dayakar: He always goes for cheap things. In the process he often buys lemon (వాడెప్పుడూ చౌక వస్తువులను కొంటాడు. అలా చేసే క్రమంలో ఎక్కువగా లోపాలతో ఉన్న వాటినే కొంటాడు).
 

b) Sukumar: Prabhakar is very good at buying the right thing. He never gets cheated (సరైన వస్తువును కొనడంలో ప్రభాకర్ చాలా గట్టి. ఎప్పుడూ మోసపోడు).
 

Venkat: That is true. He never buys a lemon. Unless he studies a thing, he does not buy it (అది నిజం. అతనెప్పుడూ లోపాలున్న వస్తువుల‌ను కొనడు. అతను ఒక వస్తువును బాగా పరీక్షిస్తేగానీ కొనడు).

2. To get back at somebody = to take revenge on somebody (ఒకరి మీద పగ తీర్చుకోవడం).

a) Sudheer: Santharam, much against his name is very vengeful. He does not rest until he takes revenge against those that cheat him (శాంతారాంది వాడి  పేరుకు వ్యతిరేకంగా చాలా కక్ష సాధింపు స్వభావం. వాడిని మోసం చేసిన వాడి మీద కక్ష సాధించనిదే ­ఊరుకోడు).
 

Sethuram: That is true. He does not rest until he gets back at the person who does harm to him (అది నిజమే. వాడికి కీడు చేసినవాడు ఎవరైనా ఉంటే, పగ సాధించేదాకా విశ్రాంతి పొందడు).
 

b) Ganesh: Vinai is often generous. He very often excuses people who cheat him (వినయ్‌ చాలా ఉదారుడు. తనను మోసం చేసిన వారెవరినైనా క్షమించేస్తాడు).
 

Mani: That is true. He does not bother about getting back at somebody, who cheats or harms him (అది నిజమే. తనను మోసం చేసే ఇతరులమీద పగ తీర్చుకోవడం గురించి పెద్దగా పట్టించుకోడు).
 

3. To play something down = To make something appear less important (ఏదైనా పెద్ద విషయాన్ని తక్కువ చేసి మాట్లాడటం).
 

a) Priya: Why does Latha make the affair appear less important than it is? (ఆ విషయానికి అంత తక్కువ ప్రాముఖ్యం ఇచ్చి మాట్లాడుతుందేమిటి లత?)
 

Prathibha: She is always like that. She does not care what happens to her. She plays down everything (త‌నెప్పుడూ అంతే. తనకేం జరుగుతోందో పెద్దగా పట్టించుకోదు. దేనైనా చిన్న విషయంగానే చూస్తుంది).
 

b) Abhimanyu: Srisanth makes mountains of a mole hill, even if the issue is not important (శ్రీశాంత్‌ ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువ చేసి మాట్లాడతాడు, దానికంత ప్రాముఖ్యం లేకపోయినా).
 

Sahadev: He is always like that. He always plays down even very important issues (అత‌నెప్పుడూ అంతే. ముఖ్యమైన విషయాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడతాడు).
 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌