• facebook
  • whatsapp
  • telegram

Fell apart, Warm up to 

ఇంగ్లిష్‌ రాతలో, సంభాషణల్లో Phrasal verbs ను ఉపయోగించడం వల్ల భాష సహజంగా ఉంటుంది. అలాంటి కొన్నింటిని ఉదాహరణల సాయంతో నేర్చుకుందాం!
 

1. Warm up to somebody = start liking someone as you spend more time with him, especially though you disliked them in the beginning (మొదట ఇష్టపడకపోయినా తర్వాత ఇష్టపడటం).
 

a) Prasanth: How do you like our new lecturer? Isn't he good at the subject and teaching? (మన కొత్త లెక్చరర్‌ నీకెలా అనిపించాడు? సబ్జెక్టు బాగా తెలిసి, బాగానే బోధిస్తాడు కదా?)
 

Jayakumar: As he taught us more and more I warmed up to him. He makes the subject sound very easy (ఆయన బోధించినకొద్దీ ఆయనంటే నాకు ఇష్టం పెరిగింది. విషయాన్ని చాలా సులభం అనిపించేలా చేస్తారు).
 

b) Vishnu: How did Vinai, our executive take to the new director? (మన ఎగ్జిక్యూటివ్‌ వినయ్‌ ఈ కొత్త డైరెక్టర్‌ అంటే ఇష్టపడుతున్నాడా?)
 

Eswar: Not much, but it is only a few days since he took over. But I am sure as time goes on he will warm up to him. He is such a nice guy (అంత ఎక్కువేం లేదు. అంటే కొన్ని రోజుల కిందేగా అతను బాధ్యతలు స్వీకరించింది. కానీ కాలం గడిచినకొద్దీ ఆయనంటే ఇష్టపడతాడు. అంత మంచివాడు ఆ డైరెక్టర్‌).
 

2. Fell apart - the past tense of fall apart = original meaning - break into pieces. But it also means the breaking up off, of a relationship (అసలర్థం: ముక్కలుగా విరిగిపోవడం. కానీ ఇక్కడ దాని అర్థం సంబంధ బాంధ్యవ్యాలు తెగిపోవడం).
 

a) Ravi: Prabhakar and Bhaskar are very good friends. They are inseparable (ప్రభాకర్‌, భాస్కర్‌ మంచి స్నేహితులు. వాళ్లను విడదీయలేం).
 

Bhargav: But not anymore. They fell apart over some affair. They are not now on talking terms (ఇప్పుడేం కాదు. ఏదో విషయం మీద వాళ్లకు తేడాలొచ్చాయి. వాళ్లిద్దరూ ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు).
 

b) Doraswamy: What an understanding between our friend and his wife! They are an ideal couple (మన స్నేహితుడికీ, వాళ్లావిడకీ ఎంత అవగాహన! వాళ్లు ఆదర్శ దంపతులు).
 

Sriram Murthy: Yea. That is really surprising. I don't think there is any chance of their marriage falling apart (అవును, అది నిజంగా ఆశ్చర్యమే. వాళ్ల పెళ్లి వీగిపోతుందనే అవకాశమే లేదు).
 

3. Glad to see the back of somebody = Happy to see a person go (ఎవరైనా వెళ్లిపోతే సంతోష పడటం, పీడా విరగడైపోయిందని).
 

a) Rajaram: Gopal doesn't like misers. He is to some extent extravagant, and he hates frugality (గోపాల్‌కు పిసినారులంటే ఇష్టం లేదు. అతను కొంతవరకూ విలాసవంతుడు, అతడికి పొదుపు అంటేనే గిట్టదు).
 

Srinivas: Oh, is that the reason he was glad to see the back of Balakrishna? Really, he is too much of a saver (అదా కారణం, అతను బాలకృష్ణ వెళ్లిపోతే సంతోషపడటానికి? నిజం చెప్పాలంటే, ఈ బాలకృష్ణ మరీ పిసినారే).
 

b) Gopi: Are you happy with the guy I introduced to you last night? (నేను నిన్న రాత్రి పరిచయం చేసిన వ్యక్తి నీకు నచ్చాడా?)
 

Anand: Doesn't he lack manners? I strongly disliked the way he talked. I felt I would be glad to see the back of him as soon as possible (అతనికేమైనా సభ్యత ఉందా? అతను మాట్లాడిన విధానం నాకు అస్సలు నచ్చలేదు. అతను ఎంత త్వరగా వెళ్లిపోతే అంత బాగుండని చాలా కోరుకున్నాను).
 

1. I warmed up to him
 

2. Their marriage fell apart
 

3. She was very glad to see the back of her

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌