• facebook
  • whatsapp
  • telegram

Put on airs, Stands out from the rest

    కొంతమంది మిగిలినవారికంటే తామే అధికులమని నమ్ముతుంటారు. అంతేకాదు, దాన్ని ప్రదర్శిస్తూ ‘ఎచ్చులు' పోతుంటారు. ఎదుటివారికి ఎబ్బెట్టుగా ఉండే స్వభావమిది. దీన్ని సమర్థంగా వ్యక్తం చేయటానికి ఇంగ్లిష్‌లో ఒక PHRASAL VERB ఉంది. దాని గురించి తెలుసుకుందామా!

Viswanath: This girl Sumithra stands out from the rest. She is a first class personal assistant (సుమిత్ర ఇతరులనుంచి వేరుగా కనపడుతుంది. ఆమె వ్యక్తిగత సహాయకురాలిగా అగ్రస్థానంలో ఉంటుంది).
 

Jayakrishna: That is true. She is way ahead of others in efficiency (అది నిజమే. సామర్థ్యంలో ఆమె అందరికంటే ముందు ఉంటుంది).
 

Viswanath: Even from her student days she was pretty smart and used to stand first in the class. Her teachers were all appreciation for her (విద్యార్థి దశలో కూడా ఆమె చాలా చురుగ్గా ఉండేది. తరగతిలో మొదటిస్థానంలో నిలబడేది. ఆమె టీచర్లు ఆమెను చాలా మెచ్చుకునేవాళ్లు).
 

Jayakrishna: Well, to get ahead in a job like hers, you have to be ready to take on a lot of responsibility and be prompt in your services (ఆమెలాంటి ఉద్యోగంలో ఉన్నవాళ్లు పైకి వెళ్లాలంటే, అలాంటివాళ్లు చాలా బాధ్యతను నెత్తిన వేసుకోవాల్సివచ్చేది, సేవల్లో ఆలస్యం చేయకుండా నడుచుకోవాల్సివచ్చేది).
 

Viswanath: Not only that. She is quite ready to handle whatever happens in the office. That is why her boss is all appreciation for her (అంతే కాదు, ఆమె ఆఫీసులో ఏం జరిగినా దాన్ని సులభంగా చేసేస్తుంది. అందుకే ఆమె బాస్‌ ప్రశంసల్ని పొందుతుంది).
 

Jayakrishna: None in the office finds fault with her work. She is at the top in efficiency (ఆఫీసులో ఎవరూ కూడా ఆమెను తప్పు పట్టేవాళ్లు లేరు. సామర్థ్యంలో ఆమె అందరికంటే మెరుగ్గా ఉంటుంది).
 

Viswanath: The other point is she is well-behaved too. She never puts on airs (ఇంకో సంగతి ఏమిటంటే... ఆమె మంచి నడవడిక కలది కూడా. ఎప్పుడూ గొప్పలకు పోయినట్టు ప్రవర్తించదు).
 

Jayakrishna: That is right. She is perfect in her manners (అది నిజమే. వైఖరి, అలవాట్లలో ఎలాంటి దోషమూ ఉండదు).
 

Notes: 1) Prompt = Done without delay (ఆలస్యం లేకుండా ఏ పనైనా చేయటం)
 

Look at the following phrasal verbs from the conversation:
 

1) This girl Sumithra stands out from the rest.
 

Stands out from the rest = ఇతరులకు భిన్నంగా ఉండటం.
 

Vinai: Ramana in our class stands out from the rest. In spite of being the top in the class he is very humble (మన తరగతిలో రమణ ఇతరులనుంచి భిన్నంగా ఉంటాడు. తరగతిలో అందరికంటే తెలివైనవాడైనప్పటికీ, చాలా నిగర్విగా ఉంటాడు)
 

Srikanth: That is indisputable. Everyone in the class likes him. He is quite friendly (అది నిర్వివాదాంశం. తరగతిలో ప్రతివారూ అతణ్ని ఇష్టపడతారు. అతను చాలా స్నేహశీలి.)
 

2) She never puts on airs. Original phrase: Put on airs = to pose as a superior to the rest.
 

Sujatha: In spite of being great and outstanding, Gandhiji never put on airs (గొప్పవాడైనప్పటికీ గాంధీ గారు ఎప్పుడూ ఎచ్చులకు పోయేవాడు కాదు).
 

Supriya: That is true. He was always humble and would not mind talking even to an ordinary person (అది నిజమే ఆయనెప్పుడూ నిగర్వి, సాధారణమైన వ్యక్తితో మాట్లాడటానికి కూడా ఏమీ సంకోచించేవాడు కాదు).

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌