వరంగల్ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ డైట్ కళాశాల ప్రిన్సిపల్ కె.నారాయణరెడ్డి జూన్ 25న తెలిపారు. జూన్ 30 వరకు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఇంటర్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు 45 శాతం, ఇతరులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. జులై 10న ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా ఫలితాల వెల్లడి
ఆరోగ్య విశ్వవిద్యాలయం: ఈ ఏడాది మే నెలలో జరిగిన మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా ఫలితాలను ఆరోగ్య విశ్వవిద్యాలయం జూన్ 25న విడుదల చేసింది. రీటోటలింగ్ కోరే అభ్యర్థులు సబ్జెక్టుకు రూ.2000 విశ్వవిద్యాలయానికి జులై 5వ తేదీలోగా చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఫలితాలు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో పొందుపర్చారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు
‣ క్లౌడ్ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.