విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

LAW CET: ఆగస్టు 5 నుంచి లాసెట్‌ కౌన్సెలింగ్‌


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ లా కళాశాలల్లో న్యాయ విద్య సీట్ల భర్తీకి ఆగస్టు 5వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి అధ్యక్షతన ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన.. 22, 23 తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల నమోదు, 27న ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు ఆయా కళాశాలల్లో అసలు ధ్రువపత్రాలను సమర్పించాలని సూచించారు. కౌన్సెలింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలను జులై 24న వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.


    పూర్తి వివరాలకు క్లిక్ చేయండి  



మరింత సమాచారం... మీ కోసం!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

Updated at : 23-07-2024 19:22:37

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం