విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Education: ఈసారీ ఉపాధ్యాయుల కొరతే

ప్రభుత్వ బడుల్లో తీరని బోధన వెతలు

విద్యా వాలంటీర్ల                    

నియామకంపై స్పష్టత కరవు


 

మరికొద్ది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. గతేడాదిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు ఉత్తీర్ణతపై ప్రభావం చూపింది. కొన్ని చోట్ల సర్దుబాటు చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం మూతబడిన బడులను తెరిపించేందుకు క్షేత్ర స్థాయిలో జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. బడుల ప్రారంభంనాటికి ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ప్రత్యామ్నాయంగా విద్యా వాలంటీర్లను నియమిస్తామని స్పష్టం చేసింది. కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదు. బోధన కష్టాలు తీరుతాయనుకున్న విద్యార్థులకు నిరాశ తప్పేలా లేదు. కొవిడ్‌ అనంతరం విద్యావాలంటీర్ల నియామక ప్రక్రియ నిలిపివేయగా.. ప్రస్తుతం నూతనం ప్రభుత్వ ఆదేశాలతో విద్యావాలంటీర్లను నియమిస్తారా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది. 


823 ఖాళీలు

ఉమ్మడి జిల్లాలో 2,560 ప్రభుత్వ పాఠశాలల్లో 1,55,935 విద్యార్థులు చదువుతున్నారు. 9,952 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. పలు పాఠశాలల్లో ఖాళీల కొరత వెక్కిరిస్తోంది. జగిత్యాల 334, కరీంనగర్‌ 245, పెద్దపల్లి 93, రాజన్నసిరిసిల్ల 151 చొప్పున సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయుల కొరత ఉంది. కొన్ని చోట్ల గ్రామస్తులు, దాతల సహకారంతో విద్యావాలంటీర్లతో కాలం వెళ్లదీస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. సదరు ఉపాధ్యాయుడు రాని రోజు ఆ పాఠశాల విద్యార్థులకు సెలవే. 


నాలుగేళ్ల తర్వాత తెరపైకి

గతంలో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు అర్హత ఉన్న వారిని విద్యా వాలంటీర్లుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో 753 మంది పని చేశారు. 2019-20 విద్యా సంవత్సరంలో కొవిడ్‌ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ ప్రక్రియను నిలిపి వేశారు. గత ప్రభుత్వం ఉన్న ఉపాధ్యాయులతోనే సర్దుబాటు చేసింది. కొత్త ప్రభుత్వం మళ్లీ విద్యా వాలంటీర్లను నియమిస్తామని ప్రకటించడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. పాఠశాలల్లో ఖాళీల కొరత కూడా తీరనుంది. 


ఎలాంటి ఆదేశాలు రాలేదు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించాలని సర్కారు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రత్యామ్నాయంగా బోధనలో ఇబ్బందులు లేకుండా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నాం. ఇప్పటి వరకు అవసరమైన వాలంటీర్ల వివరాల జాబితా నివేదించలేదు. 

- మాధవి, జిల్లా విద్యాధికారి, పెద్దపల్లి


 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

‣ నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!

‣ సోషల్‌ ట్రోలింగ్‌.. లైట్‌ తీసుకుందాం!

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

Published at : 27-05-2024 12:22:28

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం