• facebook
  • whatsapp
  • telegram

 Education : ఎక్సైజ్‌శాఖలో 116 సూపర్‌ న్యూమరరీ పోస్టులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో కానిస్టేబుళ్లకు సంబంధించి 116 సూపర్‌ న్యూమరరీ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఆరు నెలలపాటు ఈ పోస్టులు మనుగడలో ఉండనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్‌ అకాడమీలో ఆరు నెలల శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల కోసం వీటిని సృష్టించారు. 2022 రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఎక్సైజ్‌శాఖకు 614 కానిస్టేబుళ్ల పోస్టులకు నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఏడాదే ఎక్సైజ్‌శాఖలో జరిగిన పునర్విభజన ప్రకారం కొత్తగా 14 ఠాణాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ కావడంతో వాటిల్లో పనిచేసేందుకు సరిపోయేలా 614 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టారు. అయితే ఇప్పటివరకు కొత్త ఎక్సైజ్‌ ఠాణాలు ఏర్పాటు కాకపోవడంతో 614 పోస్టుల్లో 116 పోస్టులు ప్రస్తుతం అందుబాటులో లేకుండాపోయాయి. కంటీజియస్‌ డిస్ట్రిక్ట్‌-4లో 6.. కంటీజియస్‌ డిస్ట్రిక్ట్‌-5లో 6.. కంటీజియస్‌ డిస్ట్రిక్ట్‌-6లో 104 పోస్టులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలోనే తాజాగా సూపర్‌న్యూమరరీ పోస్టుల్ని సృష్టించారు. శిక్షణ ప్రక్రియ పూర్తికాగానే ఈ పోస్టులు రద్దవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.