• facebook
  • whatsapp
  • telegram

Financial Olympiad: ఫైనాన్షియల్‌ ఒలింపియాడ్‌

 

 

విద్యార్థులకు తాము చదివే సబ్జెక్టులపైనే కాకుండా ఆర్థిక అంశాలపైనా అవగాహన ఉండాలని భావించిన ‘మ్యువిన్‌’ సంస్థ... దేశవ్యాప్తంగా ఇంటర్‌ వరకూ చదివే విద్యార్థుల కోసం ‘ఫిన్‌మానియా’ పేరుతో ఫైనాన్షియల్‌ ఒలింపియాడ్‌ నిర్వహిస్తోంది. మింట్, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లతో సమష్టిగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. విద్యార్థులకు ఆర్థిక భద్రత, బీమా, మనీ మేనేజ్‌మెంట్‌లాంటి అంశాలపై అవగాహన తీసుకురావడం, సొంతంగా ఆలోచించేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పెట్టుబడి, పొదుపు, రుణం... లాంటి అనేక విషయాలను ఈ ఒలింపియాడ్‌ ద్వారా చర్చించనున్నారు. 

 

ఇందులో పాల్గొనేందుకు అక్టోబర్‌ 14వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం ఆఫ్‌లైన్‌లో జరుగుతుండగా, మిగతా చోట్ల ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. 

 

ఇందులో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. జోనల్, నేషనల్‌ స్థాయిలో విజేతలను ప్రకటించి రూ.10 లక్షల వరకూ విలువైన బహుమతులు అందజేస్తారు. 

 

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్‌సైట్‌: https://finmania.muvin.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1,00,000 స్కాలర్‌షిప్‌లు

‣ వేగంగా నేర్చుకోవాలంటే!

‣ సెలవుల్లో ఇలా చేద్దాం!

‣ యూపీఎస్సీ యాప్‌ సిద్ధం

‣ ఏఐ - ఎంఎల్‌ ఎందుకు నేర్చుకోవాలి?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.