• facebook
  • whatsapp
  • telegram

Agriculture: వ్యవసాయ డిప్లొమా కోర్సులకు కౌన్సెలింగ్‌ ప్రారంభం  

ఈనాడు, హైదరాబాద్‌: ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు బుధవారం కౌన్సెలింగ్‌ మొదలైంది. రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ కౌన్సెలింగ్‌ను రిజిస్ట్రార్‌ పి.రఘురామిరెడ్డి ప్రారంభించారు. ‘పాలిసెట్‌ - 2024’లో 455 ర్యాంకు పొందిన అరియాజరీన్‌కు జగిత్యాలలోని వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ప్రవేశం కల్పిస్తూ ధ్రువపత్రాలను అందజేశారు. పాలిసెట్‌లో 690 ర్యాంకు సాధించిన బి.లోకేశ్‌ నల్గొండ జిల్లా కంపసాగర్‌లోని వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ప్రవేశం కల్పించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ జులై 12 వరకు మొదటి విడత కౌన్సెలింగ్‌ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్‌ విభాగం డైరెక్టర్‌ జమునా రాణి, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ శ్రవణ్‌కుమార్, సహ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

‣ క్రీడల్లో కోచ్‌లుగా రాణించాలుకుంటున్నారా?!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.