• facebook
  • whatsapp
  • telegram

BTech seats: బీటెక్‌ అదనపు సీట్లు 2,640

* వాటిలో 1,848 సీట్లు కౌన్సెలింగ్‌లోకి.. ప్రభుత్వ అనుమతి
 


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 2,640 అదనపు బీటెక్‌ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలి విడత కౌన్సెలింగ్‌ నాటికి కన్వీనర్‌ కోటా కింద 70,307 సీట్లుండగా...ఇప్పుడు 72,741కి పెరిగాయి. ఆనాడు కన్వీనర్, బీ కేటగిరీ కలిపి 98,296 ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 1,01,661కి పెరిగాయి. అంటే మొత్తం సీట్లు 3,365 పెరిగాయి. కాకపోతే కౌన్సెలింగ్‌ ప్రారంభమైన తర్వాత రెండు కళాశాలలను చేర్చడంతో 725 సీట్లు కొద్ది రోజుల క్రితమే కలిశాయి. తాజాగా 2,640 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిల్లో కన్వీనర్‌ కోటా కింద 70 శాతం కలుస్తాయి. అంటే 1,848 సీట్లు కౌన్సెలింగ్‌ పరిధిలోకి వస్తాయి. కొన్ని కళాశాలలు ఇతర బ్రాంచీలను రద్దు చేసుకొని కొత్త కోర్సులకు దరఖాస్తు చేశాయి. వాటికి అనుమతి ఇస్తే ప్రభుత్వంపై బోధనా రుసుముల పేరిట ఆర్థిక భారం పడదు. అందువల్ల తొలుత బ్రాంచీ కన్వర్షన్‌ సీట్లు ఇస్తారని భావించారు. అందుకు భిన్నంగా ఆర్థిక భారం పడే అదనపు సీట్లను మంజూరు చేయటం గమనార్హం. బుధవారంతో వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ముగుస్తుంది. తాజాగా మంజూరైన సీట్లు కాకుండా ఇంకా వస్తాయా? రావా? అన్నది స్పష్టత లేదు. సాంకేతిక విద్యాశాఖ అధికారులు మాత్రం ఇప్పటి వరకు వచ్చిన వాటిని కౌన్సెలింగ్‌లో చేర్చామని చెబుతున్నారు. కొత్తగా సీట్లు పెరగడం.. కొన్ని కళాశాలల్లో కొత్త కోర్సులు రావడంతో ఇప్పటికే ఇచ్చిన వెబ్‌ ఆప్షన్లను విద్యార్థులు మార్చుకోవాల్సి ఉంటుంది. అవగాహన లేని వారు నష్టపోక తప్పదని నిపుణులు చెబుతున్నారు.  

హైకోర్టుకు కళాశాలల యాజమాన్యాలు

కొత్త సీట్లను ఏ విధానం ఆధారంగా మంజూరు చేశారన్నది విద్యాశాఖ ప్రకటించలేదు. 2,640 పెరిగాయన్నది కూడా స్పష్టత ఇవ్వలేదు. అదనపు సీట్లు కలిశాయని మాత్రమే పేర్కొంది. మూడు కళాశాలల్లో కొత్త కోర్సులు వచ్చాయని తెలిపింది. సీట్ల మంజూరులో పారదర్శక విధానం లేదని ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు విమర్శిస్తున్నాయి. విశ్వవిద్యాలయాల నుంచి ఎన్‌ఓసీ తీసుకొని.. ఏఐసీటీఈకి దరఖాస్తు చేసి ఆమోదం పొందిన తర్వాత అనుమతులు ఇవ్వకపోవడంపై కళాశాలల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కళాశాలలు హైకోర్టులో పిటిషన్‌ వేసినట్లు తెలిసింది. మరికొన్ని కళాశాలలు సైతం అదేబాటలో ఉన్నాయి.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.