• facebook
  • whatsapp
  • telegram

Jobs: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల దరఖాస్తుకు సీనియర్‌ రెసిడెంట్‌లకు అవకాశం 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు 2023 బ్యాచ్‌ సీనియర్‌ రెసిడెంట్‌లకు అనుమతి ఇస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు ఐదో తేదీకి ఏడాది సీనియర్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం పూర్తి చేసుకోనున్న సీనియర్‌ రెసిడెంట్‌లకు తాజా నోటిఫికేషన్‌ ఇచ్చిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖను కోరారు. ఈ నేపథ్యంలో డీఎంఈ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సిఫారసు మేరకు ఒకసారి అవకాశంగా పేర్కొంటూ దరఖాస్తుకు అనుమతిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ జులై 9న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, కార్యదర్శి, డీఎంఈకి సీనియర్‌ రెసిడెంట్స్‌ అసోసియేషన్‌ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపింది.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! !

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.