• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ICAR: ఐకార్‌ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2024 

2023-24 విద్యా సంవత్సరానికి వ్యవసాయ సంబంధ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌(ఐకార్‌)- ఆలిండియా కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల్లో ప్రత్యేకించిన సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు.

పరీక్ష వివరాలు:

* ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (ఐకార్‌) ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2024

స్పెషలైజేషన్: క్రాప్ సైన్సెస్, హార్టికల్చర్, వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్, డెయిరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ అండ్‌ ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్, ఫిషరీ సైన్స్, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అండ్‌ అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌టెన్షన్‌, అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంటెక్‌, ఎంవీఎస్సీ, ఎంఎఫ్‌ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.  

వయోపరిమితి: 31.08.2024 నాటికి 20 ఏళ్లు నిండి ఉండాలి. 

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి 120 నిమిషాలు. ప్రశ్నల సంఖ్య 120. గరిష్ఠ మార్కులు 480.

దరఖాస్తు రుసుము: జనరల్/ యూఆర్‌ అభ్యర్థులకు రూ.1900; ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1800; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.975.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష నగరాలు: తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 11.05.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 13.05.2024 నుంచి 15.05.2024 వరకు.

పరీక్ష తేదీ: 29.06.2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :