• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ICI: ఐసీఐ తిరుపతి నోయిడాలో బీబీఏ, ఎంబీఏ కలినరీ ఆర్ట్స్ ప్రోగ్రామ్ 

కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖకు చెందిన తిరుపతి, నోయిడాల్లోని ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్(ఐసీఐ)- 2024-25 విద్యా సంవత్సరానికి బీబీఏ, ఎంబీఏ (కలినరీ ఆర్ట్స్) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రవేశం పొందిన విద్యార్థులకు చెఫ్‌, కిచెన్‌ మేనేజ్‌మెంట్- కలినరీ స్పెషలిస్టులుగా ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు.

ప్రోగ్రామ్ వివరాలు...

1. బీబీఏ (కలినరీ ఆర్ట్స్): ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు.

సీట్ల వివరాలు: ఐసీఐ తిరుపతిలో 120 సీట్లు; ఐసీఐ నోయిడాలో 120 సీట్లు ఉన్నాయి.

అర్హత: కనీసం 45% మార్కులతో ఇంటర్‌/ 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు సరిపోతుంది. 

ఎంపిక ప్రక్రియ: సీయూఈటీ(యూజీ) 2024 స్కోరు లేదా ఐసీఐ నిర్వహించే ఐజీఎన్‌టీయూ- జేఈఈ(యూజీ) 2024 స్కోరు తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

2. ఎంబీఏ (కలినరీ ఆర్ట్స్) ప్రోగ్రామ్: ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు.

సీట్ల వివరాలు: ఐసీఐ తిరుపతిలో 30 సీట్లు; ఐసీఐ నోయిడాలో 30 సీట్లు ఉన్నాయి.

అర్హత: కనీసం 45% మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు సరిపోతుంది. 

ఎంపిక ప్రక్రియ: సీయూఈటీ(పీజీ) 2024 స్కోరు లేదా ఐసీఐ నిర్వహించే ఐజీఎన్‌టీయూ- జేఈఈ(యూజీ) 2024 స్కోరు తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 25, 2024.

ఆన్‌లైన్ జేఈఈ పరీక్ష తేదీ (యూజీ/ పీజీ): మే 26, 2024

జేఈఈ (యూజీ/ పీజీ) ఫలితాలు: మే 31, 2024.

మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు: జూన్ 3, 2024.

మొదటి రౌండ్ రిపోర్టింగ్: జూన్ 3 నుంచి జూన్ 6, 2024 వరకు.

రెండో రౌండ్ సీట్ల కేటాయింపు: జూన్ 10, 2024.

రెండో రౌండ్ రిపోర్టింగ్: జూన్ 10 నుంచి జూన్ 13, 2024 వరకు.

చివరి రౌండ్ సీట్ల కేటాయింపు: జూన్ 18, 2024.

చివరి రౌండ్ రిపోర్టింగ్: జూన్ 18 నుంచి జూన్ 21, 2024 వరకు.

ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్: జూన్ 24 నుంచి జూలై 12, 2024 వరకు.

అకడమిక్ సెషన్ ప్రారంభం: జులై 15, 2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 21-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :