‣ చిన్న నేరాలే అత్యధికం
దేశంలోని న్యాయస్థానాల్లో అపరిష్కృత వ్యాజ్యాలు కొండల్లా పేరుకుపోతున్నాయి. చిన్నచిన్న నేరాలు, చిన్నపాటి చట్టాల ఉల్లంఘనలు కూడా క్రిమినల్ న్యాయపరిధిలో ఉండటం న్యాయస్థానాల్లో కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. కోర్టుల్లో కేసుల పెను విస్ఫోటానికి పలు కారణాలను ఇటీవల జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ విశ్లేషించారు. ప్రధాని సైతం- పనికిరాని చట్టాలను, వర్తమాన పరిస్థితులకు అనువుగా లేని చట్ట నిబంధనలను రద్దు చేయాలని సదస్సులో పిలుపిచ్చారు. కోర్టుల్లో పేరుకుపోతున్న కేసుల సంఖ్యను తగ్గించడానికి, సులభతర వాణిజ్యానికి అడ్డంకిగా మారుతున్న పారిశ్రామిక, కంపెనీల చట్టాల్లోని చిన్న నేరాలు, ఉల్లంఘనలకు సంబంధించిన నిబంధనలను క్రిమినల్ నేరాల పరిధిలోంచి తప్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జాతీయ న్యాయ గణాంకాల వ్యవస్థ అంచనా ప్రకారం దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య నాలుగు కోట్ల పైమాటే. వాటిలో క్రిమినల్ కేసులు 72.8 శాతంతో సింహభాగం ఆక్రమిస్తున్నాయి. అందులోనూ చిన్ననేరాలు, చిన్నపాటి చట్ట ఉల్లంఘనల కేసులే అధికంగా ఉంటున్నాయి. వాటివల్ల పెద్ద నేరాల విచారణలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. న్యాయ వ్యవస్థపై భారాన్ని తగ్గించడానికి చిన్న నేరాలను, చట్ట ఉల్లంఘనలను క్రిమినల్ నేరాల పరిధి నుంచి తప్పించి సివిల్ కేసులుగా మార్చాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. దురుద్దేశపూర్వకం కాని వాటికి, చిన్న తప్పులకు జైలుశిక్ష వంటివి విధించకుండా జరిమానాలతో సరిపెట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు చెక్‌బౌన్స్, రుణాల చెల్లింపులకు సంబంధించిన కేసుల్లో శిక్షలకు బదులు భారీ జరిమానాలను విధించవచ్చు.
చాలాకాలంగా కసరత్తు
దేశాన్ని సులభతర వాణిజ్యానికి, స్నేహపూర్వక వ్యాపారానికి గమ్యస్థానంగా మార్చాలని కేంద్రం సంకల్పించింది. కంపెనీల చట్టాల్లోని ఆర్థిక పరమైన చిన్నతప్పులు, ఉల్లంఘనలను క్రిమినల్ నేరాల పరిధి నుంచి తప్పించేందుకు చాలాకాలంగా కసరత్తు చేస్తోంది. వాటిని క్రిమినల్ న్యాయ పరిధి నుంచి తొలగించే, సవరించే అవకాశాలను పరిశీలించాలని వివిధ విభాగాల అధిపతులను ఏప్రిల్‌లో ప్రధాని ఆదేశించడంతో ఆ దిశగా మళ్ళీ కదలిక మొదలైంది. కంపెనీల చట్టం-2013 పరిధిలోని నేరాలను సమీక్షించడానికి 2018లో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పది మందితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ 81 రాజీ కుదుర్చుకోదగిన నేరాల్లో పదహారింటి తీవ్రత, పరిధి తగ్గించాలని, అంతర న్యాయ నిర్ణయ వ్యవస్థ ద్వారా జరిమానాలను నిర్ణయించాలని సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులు కంపెనీల(సవరణ) చట్టం-2019 ద్వారా అమలులోకి వచ్చాయి. 16 నేరాలను సివిల్ ఉల్లంఘనలుగా 2019 చట్టం వర్గీకరించి, ఉల్లంఘనలకు జరిమానాలను సెక్షన్ 454లో చేర్చింది. మరో 46 నేరాలను కంపెనీల (సవరణ) చట్టం-2020 ద్వారా సివిల్ ఉల్లంఘనలుగా మార్చారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం, ఆర్‌బీఐ చట్టం, బీమా చట్టం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం తదితర 19 చట్టాలకు సంబంధించిన 39 ఆర్థిక నేరాలకు సైతం తీవ్రత, పరిధి తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. చిన్న నేరాల తీవ్రత తగ్గించే ప్రక్రియ కోసం మరిన్ని చట్టాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అందుకోసం నీతి ఆయోగ్ రూపొందించిన పత్రంలో 28 చట్టాల్లోని 120 నిబంధనలు అనువైనవిగా గుర్తించింది.
అనవసర వ్యయాలు
కేంద్ర ప్రభుత్వం చిన్న నేరాల తీవ్రతను తగ్గించడానికి పూనుకోవడాన్ని న్యాయ, వ్యాపార రంగాలకు చెందిన నిపుణులు స్వాగతిస్తున్నారు. పారిశ్రామిక చట్టాల్లోని కొన్ని నిబంధనలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, చిన్న, లఘు పరిశ్రమలకు ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి. చిన్న నేరాల తీవ్రత, పరిధి తగ్గితే వారు వ్యాపారాభివృద్ధికి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలకు, సంస్థలకు అనవసర వ్యయాలు తప్పుతాయి. కార్పొరేట్ వ్యవస్థల ప్రమాణాలు మెరుగుపడతాయి. సంస్థలను అనవసర వివాదాల నుంచి రక్షించి, సంస్థ వనరులను సరైన దిశలో ఉపయోగించే అవకాశం లభిస్తుంది. కంపెనీలు కేసుల భయం లేకుండా స్వేచ్ఛగా వ్యాపార విధానాలను రూపొందించి అమలు చేస్తాయి. అది దేశ ఆర్థికాభివృద్ధికి, స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ పురోగమనానికి దోహదం చేస్తుంది. కోర్టులు కూడా తీవ్రస్థాయి నేరాల విచారణపై దృష్టి కేంద్రీకరించే అవకాశం పెరుగుతుంది. కోర్టులపై కేసుల భారం గణనీయంగా తగ్గుతుంది. చిన్న చిన్న కార్పొరేట్ ఉల్లంఘనల విషయంలో శిక్షలకు బదులుగా జరిమానాలతో సరిపెట్టవచ్చంటూ ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చిన్న నేరాల తీవ్రతను తగ్గించాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేస్తోంది. అయితే, నేరం, ఉల్లంఘన ఎంత చిన్నవైనా వాటి వెనక దురుద్దేశం ఉండరాదన్న సూత్రం, మంచి చేస్తున్నామన్న విశ్వాసం, ప్రజాప్రయోజనాల ప్రాతిపదికగానే వాటి తీవ్రతను తగ్గించే ప్రక్రియ కొనసాగాలి. బయటికి కనిపించని దురుద్దేశాలు ఉండే నేరాలను నిర్ధారించి భారీ జరిమానాలు విధించాలని, చెల్లింపులను నిర్లక్ష్యం చేస్తే కఠినంగా శిక్షించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. నేర చర్యలు, ఉల్లంఘనల వెనక ఎటువంటి ఉద్దేశాలు ఉన్నా, లేకున్నా- అవి పెట్టుబడిదారులకు, రుణదాతలకు, సంస్థల పరిపాలన వ్యవస్థకు ఇబ్బందులు కలగజేస్తాయి. పెట్టుబడిదారులు, రుణదాతల ప్రయోజనాలను కూడా చట్టాలు కాపాడాలి. రుణ చెల్లింపుల్లో జాప్యం వంటి నేరాలపై సమర్థమైన సమస్యా పరిష్కార యంత్రాంగాన్ని నెలకొల్పాలి. ఒప్పందాల అమలుకు విధానాల రూపకల్పన అవసరం. చిన్న నేరాల తీవ్రత, పరిధిని తగ్గించడం, పెట్టుబడిదారులు, రుణదాతల ప్రయోజనాలకు మధ్య సమతుల్యత ఉండేలా విధానాల రూపకల్పనతో పాటు, వ్యవస్థల నిర్మాణం జరగాలి. అప్పుడే ఈ ప్రక్రియ పరమార్థం నెరవేరుతుంది. శీఘ్రతర న్యాయానికి, సమర్థ సులభతర వాణిజ్య నిర్వహణకు మార్గం ఏర్పడుతుంది.
పురోగతి కరవు
కంపెనీల చట్టాల్లోని కొన్ని నిబంధనలు సైతం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, సులభతర వాణిజ్య ప్రక్రియకు ఆటంకాలుగా పరిణమిస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి నిబంధనలకు సంబంధించి చిన్న ఉల్లంఘనలను సైతం క్రిమినల్ నేరాలుగా పరిగణిస్తుండటంతో పలు కంపెనీల డైరెక్టర్లు, సీఈఓలు, చార్టర్డ్ అకౌంటెంట్లు విచారణల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆయా కేసుల్లో 80 శాతం వరకు చిన్న తప్పిదాలు, పొరపాట్లేనన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. అటువంటి కేసులు చిన్నవైనా మార్కెట్లో, ప్రజల్లో కంపెనీల ప్రతిష్ఠను దెబ్బతీస్తాయి. పెట్టుబడులకు అవరోధంగా మారతాయి. కంపెనీల చట్టంలో పేర్కొన్న చిన్న నేరాలను విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసినా కేసుల విచారణలో పురోగతి లేదు. చాలా కేసుల్లో అభియోగ పత్రాలే దాఖలు కాలేదు.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ జోరెత్తుతున్న పార్టీ ఫిరాయింపులు
‣ సహకార బలిమి... రైతుకు కలిమి!
‣ పశ్చిమాసియాతో బలపడుతున్న బంధం
‣ గర్భ విచ్ఛిత్తి నిర్ణయాధికారం ఆమెదే!