• facebook
  • whatsapp
  • telegram

AP TET 2024: ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్‌ పరీక్షలు

* నోటిఫికేషన్‌ విడుదల

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక (టెట్‌)ను ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టెట్‌ నోటిఫికేషన్‌ను  జులై 1న ప్రభుత్వం విడుదల చేసింది. పేపర్‌-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్‌-1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. పేపర్‌-2ఏ స్కూల్‌ అసిస్టెంట్లకు, పేపర్‌-2బీ ప్రత్యేక విద్య స్కూల్‌ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లకు ప్రత్యేకంగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. సిలబస్, పరీక్ష విధానం తదితర వివరాలను నోటిఫికేషన్‌లో పేర్కొంది. టెట్‌ దరఖాస్తు రుసుమును జులై 3 నుంచి 16 వరకు, దరఖాస్తుల సమర్పణకు 4 నుంచి 17 వరకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌ నమూనా పరీక్షలకు 16 నుంచి ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచుతారు. జులై 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. టెట్‌ పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం ప్రాథమిక ‘కీ’ని ఆగస్టు 10న, తుది కీని 25న విడుదల చేస్తారు. ఆగస్టు 30 టెట్‌ ఫలితాలు ప్రకటిస్తారు. 
 


  టెట్ స్టడీమెటీరియల్   

     

పేపర్ - I పేపర్ - II
 పరిసరాల పరిజ్ఞానం  సాంఘిక శాస్త్రం
 గణితం  జనరల్ సైన్స్
 లాంగ్వేజ్ - II (ఇంగ్లిష్)  గణితం
 లాంగ్వేజ్ - I (హిందీ)  లాంగ్వేజ్ - II (ఇంగ్లిష్)
 లాంగ్వేజ్ - I (తెలుగు)  లాంగ్వేజ్ - I (హిందీ)
 శిశువికాసం & పెడగోజీ  లాంగ్వేజ్ - I (తెలుగు)
   శిశువికాసం & పెడగోజీ
 పాత ప్రశ్నప‌త్రాలు
 నమూనా ప్రశ్నపత్రాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.