• facebook
  • whatsapp
  • telegram

Gurukula Jobs: గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియకు పూర్తి కసరత్తు

జూన్‌ నెలాఖరులోగా పెండింగ్‌ ఫలితాలు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంక్షేమ గురుకుల సొసైటీల్లో ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియను ముగించేందుకు కసరత్తు మొదలైంది. తుది నిర్ణయాలు తీసుకునేందుకు త్వరలో బోర్డు సమావేశం నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు 2023 ఆగస్టులో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించి, ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించింది. ఇందులో దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించినా... ఫలితాలు రావడానికి ఆలస్యమైంది. దాంతో వీరిని మినహాయించి మిగతా కేటగిరీల అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను ఇప్పించారు. ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. వారికి పోస్టులో పంపిస్తామని చెప్పినప్పటికీ లోక్‌సభ ఎన్నికల కోడ్‌ వచ్చింది. మొత్తానికి గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, జేఎల్, డీఎల్‌ తదితర దాదాపు 1600 పోస్టులకు పూర్తిస్థాయి ఫలితాలు, నియామకపత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కోడ్‌ ముగియడంతో దివ్యాంగ కేటగిరీ అభ్యర్థుల తుది ఫలితాలతోపాటు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులందరికీ నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉంది. ఈనెలాఖరులోగా సాంకేతిక సమస్యలను అధిగమించి జులైలో పోస్టింగుల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గురుకుల బోర్డు ఛైర్‌పర్సన్, ఐఏఎస్‌ అధికారిణి ఆయేషా మస్రత్‌ఖానం ఆధ్వర్యంలో నియామక ప్రక్రియను ముగించేందుకు త్వరలో సభ్యులు సమావేశం కానున్నారు. గతేడాది చేపట్టిన ఆర్ట్, క్రాఫ్ట్‌ టీచర్‌ పోస్టులకు పునఃపరీక్ష నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. దీనిపైనా బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు బోర్డుకు కార్యనిర్వాహక అధికారి (కన్వీనర్‌)గా ఉన్న మల్లయ్య భట్టు సర్వశిక్ష అభియాన్‌ పీడీగా బదిలీ అయ్యారు. ఈ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయమై ఇంకా నిర్ణయం జరగలేదు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.