• facebook
  • whatsapp
  • telegram

TGPSC Group-1: జూన్‌ 24 నుంచి వెబ్‌సైట్లో గ్రూప్‌-1 ఓఎంఆర్‌ ఇమేజింగ్‌ పత్రాలు

పరీక్షకు హాజరైన 3,02,172 మంది అభ్యర్థులు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జూన్‌ 9న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు 3,02,172 మంది అభ్యర్థులు హాజరయ్యారని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్‌ ఇమేజింగ్‌ పత్రాలు జూన్‌ 24 సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌లో వివరాలు నమోదు చేసి వాటిని పొందవచ్చని సూచించారు. రాష్ట్రంలో 563 పోస్టులతో కూడిన గ్రూప్‌-1 ఉద్యోగ ప్రకటనకు 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. 74.86 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని నవీన్‌ నికోలస్‌ ప్రకటించారు. అత్యధికంగా వనపర్తిలో 82.74 హాజరు శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 61.78 శాతం నమోదైందని తెలిపారు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.