‣ కొత్త సీట్లకు అనుమతి ఇవ్వకపోవడమే కారణం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా సీట్లు దాదాపు మూడు వేలకు తగ్గాయి. పలు ప్రైవేట్ కళాశాలలు డిమాండ్ లేని సీట్లను తగ్గించుకొని వాటి స్థానంలో సీఎస్ఈ, ఏఐ అండ్ ఎంఎల్ తదితర సీట్ల కన్వర్షన్కు ఏఐసీటీఈకి దరఖాస్తు చేయగా...ఆమోదం లభించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదు. గతేడాది మొత్తం 29,396 సీట్లుండగా... జూన్ 22 నుంచి జరిగే పాలిసెట్ కౌన్సెలింగ్లో కేవలం 26,412 మాత్రమే ఉన్నాయి. మరో వైపు కొన్ని కళాశాలలు సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈకి దరఖాస్తు చేయగా.. సుమారు మరో 3 వేల సీట్లు మంజూరయ్యాయి. వాటికి కూడా విద్యాశాఖ నుంచి అనుమతి రాలేదు. అదనపు సీట్లకైతే బోధన రుసుములు చెల్లించాల్సి ఉన్నందున ఆర్థిక భారం పడుతుందని అంచనా. కనీసం కన్వర్షన్ సీట్లకు కూడా ఎందుకు అనుమతి ఇవ్వలేదో అర్ధం కావడం లేదని కళాశాలల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.